Unique Station: ఈ బెంచీలో సగ భాగం గుజరాత్‌లో ఉంటే మరో సగం మహారాష్ట్రలో.. ఇంతకీ వింత ప్రదేశం ఎక్కడంటే.
దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు ఇలా అన్నింటికి మధ్య సరిహద్దులు ఉంటాయనే విషయం తెలిసిందే. ఈ సరిహద్దు రేఖలో ఆ ప్రాంతాలను ఒక దాని నుంచి మరొకటి విభజిస్తాయి. అయితే కొన్ని దేశాల సరిహద్దులు భారీ భద్రత నడుమ విభజిస్తే మరికొన్ని దేశాల..
దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు ఇలా అన్నింటికి మధ్య సరిహద్దులు ఉంటాయనే విషయం తెలిసిందే. ఈ సరిహద్దు రేఖలో ఆ ప్రాంతాలను ఒక దాని నుంచి మరొకటి విభజిస్తాయి. అయితే కొన్ని దేశాల సరిహద్దులు భారీ భద్రత నడుమ విభజిస్తే మరికొన్ని దేశాల మధ్య సరిహద్దులు చాలా నార్మల్‌గా ఉంటాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య విచిత్రమైన సరిహద్దులు ఉన్నాయి. ఇలాంటి సరిహద్దులకు సబంధించిన ఫొటోలు నెట్టింగ్ వైరల్ అవుతూనే ఉంటాయి.
అయితే రాష్ట్రాల మధ్య ఉండే కొన్ని సరిహద్దులు కూడా ఇలాగే చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి నవపూర్‌లోని రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ రెండు రాష్ట్రాల మధ్య ఉండడం విశేషం. అందుకే ఈ స్టేషన్ దేశంలోనే విభిన్నమైందిగా గుర్తింపు సంపాదించుకుంది. నవాపూర్ రైల్వే స్టేషన్ గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. ఈ స్టేషన్ పొడవు మొత్తం 800 మీటర్లు ఉండగా ఇందులో 500 మీటర్లు గుజరాత్‌లో ఉండగా మిగతా 300 మీటర్ల స్టేషన్ మహారాష్ట్రలో ఉంటుంది.
అంతేకాదు ఈ రైల్వేస్టేషన్‌లోని బెంచి మధ్యగుండా రెండు రాష్ట్రాల సరిహద్దు ఉండడం మరో విశేషం. బెంచికి ఒకపక్క మహారాష్ట్రలో ఉంటే, మరోపక్క గుజరాత్‌లో ఉంటుంది. ఈ రైల్వేస్టేషన్‌లో టికెట్ కౌంటర్ మహారాష్ట్రలో ఉంటే, ప్రయాణికుల వెయిటింగ్‌రూమ్‌లు, రైల్వే అధికారుల గదులు గుజరాత్‌లో ఉంటాయి. ఇలా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న రైల్వే స్టేషన్‌ల జాబితాలో మరో స్టేషన్ కూడా ఉంది. అదే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నడుమ ఉన్న భవానీ మండి స్టేషన్.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..