Virat Kohli Video: వారెవ్వా.. ఏం బంతి రా బాబు.. విరాట్ కోహ్లీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బంగ్లా బౌలర్..

IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇస్లాం అతన్ని పెవిలియన్‌కు పంపాడు.

Virat Kohli Video: వారెవ్వా.. ఏం బంతి రా బాబు.. విరాట్ కోహ్లీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బంగ్లా బౌలర్..
Ind Vs Ban Virat Kohli Lbw Video
Follow us
Venkata Chari

|

Updated on: Dec 14, 2022 | 1:23 PM

భారత్-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి ఛటోగ్రామ్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. అయితే, టీమిండియా ఆరంభం అంతగా బాగోలేదు. దీంతో భారత్ 48 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కోహ్లీ ఔటైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. తైజుల్ ఇస్లాం విరాట్ కోహ్లీకి పెవిలియన్ దారి చూపించాడు.

టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సమయంలో, రాహుల్, శుభ్‌మన్ గిల్ జట్టుకు ఓపెనర్‌కు వచ్చారు. గిల్ 20 పరుగులు, రాహుల్ 22 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యారు. ఆ తర్వాత 5 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి కోహ్లి అవుటయ్యాడు. ఇస్లాం అతడిని ఎల్‌బీడబ్ల్యూతో ఔట్ చేశాడు. కోహ్లి ఔట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విరాట్ ఔటైన వైరల్ వీడియో..

2019 నుంచి టెస్టు ఫార్మాట్‌లో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతను జనవరి 2022లో దక్షిణాఫ్రికాపై తన చివరి అర్ధ సెంచరీని సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 79 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను 7 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. కోహ్లీ అంతకుముందు 2022 జులైలో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..