ICC Rankings: ఐఐసీ తాజా వన్డే ర్యాకింగ్స్‌లో 117 స్థానాలు ఎగబాకిన ఇషాన్ కిషన్.. మరి కింగ్ కోహ్లీ ఏ స్థానంలో నిలిచాడంటే..?
ఇషాన్ అయితే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇషాన్, కోహ్లీ కనబర్చిన అద్భుత ఇన్నింగ్స్‌తో మూడో మ్యాచ్ గెలిచిన భారత్ సిరీస్ కోల్పోయినా.. పరువు నిలుపుకున్నట్లయింది. అంతేకాక..
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో మెరుపులు మెరిపించగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన 72వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఇక ఇషాన్ అయితే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇషాన్, కోహ్లీ కనబర్చిన అద్భుత ఇన్నింగ్స్‌తో మూడో మ్యాచ్ గెలిచిన భారత్ సిరీస్ కోల్పోయినా.. పరువు నిలుపుకున్నట్లయింది. అంతేకాక టీమిండియా అభిమానులు కూడా కొంత మేర సంతృప్తిచెందారు. అయితే ఇప్పుడు వారు సంతోషించదగ్గ మరో విషయం ఏమిటంటే.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ పైకి ఎగబాకాడు. ఐఐసీ బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో 117 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్‌లో కోహ్లి కూడా మెరుగుదలను పొందాడు.
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. మూడేళ్ల తర్వాత వన్డేల్లో బంగ్లాదేశ్‌పై చేసిన తొలి సెంచరీతో కోహ్లీ ర్యాంకింగ్స్‌లో కొంత మెరుగుపడ్డాడు. చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌లో తన 72వ సెంచరీని నమోదుచేశాడు. 2019 ఆగస్టు తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ.
టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి లాబుషేన్
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో.. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడు సెంచరీల తర్వాత ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లాబుస్‌చాగ్నే కెరీర్-బెస్ట్ 937 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గత వారం పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో దానిలో సెంచరీ సాధించాడు. రెండో ర్యాంక్‌లో ఉన్న స్టీవ్ స్మిత్‌తో పోలిస్తే లాబుషెన్ ఇప్పుడు 62 రేటింగ్ పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు అత్యుత్తమ రేటింగ్ పొందిన ఆటగాళ్ల పరంగా కోహ్లీతో కలిసి 11వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మాన్ 961 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ కూడా 961 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, టాప్ 10లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ (942 రేటింగ్ పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..