Weather Alert: అల్లకల్లోలం సృష్టించనున్న అల్పపీడనం..! రాబోతున్న భారీ వర్షాలు..

అకాల వర్షాలతో ఏపీ‌ అతలాకుతలం అవుతోంది. అకాల వర్షాలకు కొన్ని జిల్లాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం

Weather Alert: అల్లకల్లోలం సృష్టించనున్న అల్పపీడనం..! రాబోతున్న భారీ వర్షాలు..

|

Updated on: Dec 14, 2022 | 9:45 AM


మాండూస్‌ తుపాను తీరాన్ని దాటి మూడు రోజులవుతున్నా రాష్ట్రంలో ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వానలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇటు తెలంగాణ, అటు ఏపీల్లో మాండూస్‌ తుఫాను రైతన్నలను కంటతడి పెట్టిస్తోంది. ధాన్యం కొనుగోళ్ళు లేక గత 20 రోజులుగా రోడ్లపైనే ధాన్యం పోసుకుని రైతన్నలు వాటి అమ్మకం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయదు, మిల్లర్లు తీసుకోరు. ఏం చేయాలతో తోచక.. రవాణా ఖర్చులు భరించలేక ధాన్యం రోడ్లపైనే కుప్పలు పోసి, ఇప్పుడు మాండూస్‌ తుఫానుతో రైతన్నలు కుప్పయ్యారు. కుండపోత వర్షాల వల్ల తీరని నష్టం వాటిల్లింది. రోడ్ల పై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయిపోతుంటే తల్లడిల్లి పోతున్నారు.. రెక్కల కష్టాన్ని కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Follow us