AP Rains: వానలే వానలు.. అమ్మబాబోయ్.! ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. తాజా వెదర్ రిపోర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఆ వాతావరణ వివరాలు ఇలా..
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం,ఈ రోజు అనగా నవంబర్ 11న భారత కాలమానం ప్రకారం 08.30 గంటలకు సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశగా వంగి ఉన్నది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజులలో దాదాపు నెమ్మదిగా పశ్చిమ దిశగా తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉంది.
నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి, ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించి, సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
ఇది చదవండి: గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!
———————————— ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- —————————————-
ఈరోజు, రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- —————————————
ఈరోజు, రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ :- ———————————
ఈరోజు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఇది చదవండి: చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..