Andhra Pradesh: బాబోయ్.. మాడు పగిలే ఎండలు బీకేర్‌ఫుల్.. ఏపీ ప్రజలకు అలెర్ట్..

|

Apr 17, 2023 | 9:31 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో ఏపీ వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం, మంగళవారం ఏపీలోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని.. ప్రజలను హెచ్చరించింది.

Andhra Pradesh: బాబోయ్.. మాడు పగిలే ఎండలు బీకేర్‌ఫుల్.. ఏపీ ప్రజలకు అలెర్ట్..
Heat Wave
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో ఏపీ వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం, మంగళవారం ఏపీలోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని.. ప్రజలను హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతేనే బయటకు వెళ్లాలంటూ సూచించింది. ఒకవేళ బయటకు వెళ్లడం తప్పనిసరైతే.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. అనకాపల్లి, ఎన్టీఆర్‌ జిల్లాలో.. వడగాల్పుల ప్రభావం అత్యధికంగా ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో నేడు, రేపు 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

ఐఎండి అంచనాల ప్రకారం సోమవారం 116 మండలాల్లో, మంగళవారం 61 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.

సోమవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (116) :-

ఇవి కూడా చదవండి

అల్లూరి జిల్లా 7, అనకాపల్లి 15, తూర్పుగోదావరి 8, ఏలూరు4, గుంటూరు6, కాకినాడ 9, కృష్ణా 6, నంద్యాల 4, ఎన్టీఆర్ 15, పల్నాడు 2, పార్వతీపురంమన్యం 10, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 1, విజయనగరం 13, వైఎస్ఆర్ 13 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే, ఆదివారం అనకాపల్లి 11, కాకినాడ 3, విజయనగరం3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యాయని.. 100 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..