YCP Office: వైసీపీకి మరో షాక్… విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు..!

ఒక వైపు అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చట్టబద్ధత లేదంటూ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేసిన రోజునే విశాఖలోని పార్టీ ఆఫీస్‌కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాల కూల్చివేత పూర్తయిన వెంటనే విశాఖ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

YCP Office: వైసీపీకి మరో షాక్... విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు..!
Gvmc Notice To Ycp Office
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 22, 2024 | 12:52 PM

ఒక వైపు అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చట్టబద్ధత లేదంటూ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేసిన రోజునే విశాఖలోని పార్టీ ఆఫీస్‌కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాల కూల్చివేత పూర్తయిన వెంటనే విశాఖ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం అనుమతులు లేకుండా కార్యాలయాలను ఎలా నిర్మించిందనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా విశాఖలోనూ వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించింది జీవీఎంసీ. ఎండాడలోని సర్వే నంబర్ 175/4 లో 2 ఎకరాలలో స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని నోటీసులలో అభ్యంతరం వ్యక్తం చేసిన మున్సిపల్ కార్పొరేషన్, జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతులు కోసం వీఎంఆర్‌డీఏకు దరఖాస్తు చేయడం, అక్కడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై వివిరణ కోరింది. వారం రోజుల్లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసు అంటించారు జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్.

హడావుడిగా అనుమతుల ప్రక్రియ..!

మూడేళ్ల క్రితం విశాఖలోని చినగదిలి మండలం ఎండాడ గ్రామం సర్వే నంబరు 175/4లో రెండు ఎకరాల స్థలాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి కేటాయించారు. సాధారణంగా ఇక్కడ కట్టే భవన నిర్మాణాలకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీఎంఆర్డీఏలో ప్లాన్ అనుమతి కోసం 525 రోజుల క్రితం దరఖాస్తు చేశారు. ఇందుకోసం 10వేలు చెల్లించారు. అయితే, ఇన్నాళ్లూ ఏమైందో తెలియదు కానీ, రెండు రోజుల క్రితం, జూన 20వ తేదీ గురువారం మధురవాడ జోన్-2 సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి ఎండాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గరకు వెళ్లారు. భవన నిర్మాణాలకు ప్లాన్ ఉందా.. లేదా అని ఆరా తీశారు. దీంతో 525 రోజులుగా ఈ భవనాల ప్లాన్ దస్త్రం వీఎంఆర్డీఏలో పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.

రెండు రోజుల క్రితం అనుమతుల కోసం రూ.14 లక్షలు..!

525 రోజులుగా భవన నిర్మాణానికి అనుమతులు రాలేదని తెలిసి, జూన్ 20వ తేదీన 14 లక్షలు చెల్లించారు వైసీపీ నేతలు. దీంతో ఎన్టీపీ లాగిన్ నుంచి అదేరోజు రాత్రి 7.27 గంటలకు దస్త్రం ముందుకు కదిలి వీఎంఆర్డీఏ టౌన్ ప్లానింగ్ లోని సతీష్ అనే ఉద్యోగి లాగిన్ కు చేరింది. ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం 3.57 గంటలకు డి. రామానాయుడు అనే ఉద్యోగి లాగిన్ కు వెళ్లగా, అక్కడ 19 నిమిషాల్లో దస్త్రానికి ఆమోదముద్ర వేసి పై అధికారులకు పంపినట్టు తాజాగా గుర్తించిన జన సేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీఎంఆర్డీఏ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు నిలిపివేశారు. ఇది గమనించిన జీవీఎంసీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసలు అంటించడంతో చర్చనీయాంశంగా మారింది.

వీడియో…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..