Pawan Kalyan: అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ఫస్ట్ స్పీచ్.. అదరగొట్టేశారుగా..

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకి శుభాకాంక్షలు చెబుతూనే కీలక సూచనలు చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. ఇకపై ప్రత్యర్థులను తిట్టే ఛాన్స్‌ను అయ్యన్న కోల్పోయారన్నారు. ఇప్పటివరకు అయ్యన్నలో వాడివేడిని చూశారు… ఇకపై ఆయన హుందాతనాన్ని చూస్తారన్నారు పవన్‌ .

Pawan Kalyan: అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ఫస్ట్ స్పీచ్.. అదరగొట్టేశారుగా..

|

Updated on: Jun 22, 2024 | 1:04 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.  శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో అధికారిక ప్రకటన తర్వాత సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇతర కూటమి సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అసెంబ్లీలో తొలిసారి మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. “ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి, వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి, వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగా తిట్లకి, బూతులకి, కొట్లాటకు వాడితే , మనం ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములుగారి బలిదానాన్ని అవమానం చేసినట్లే..” అని పవన్ పేర్కొన్నారు. పవన్ మాటలకు ఇతర సభ్యులు బల్లాలను చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

 

 

 

Follow us