Savitri Thakur: పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట.! ఓ లెవెల్‌లో ట్రోలింగ్‌.

Savitri Thakur: పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట.! ఓ లెవెల్‌లో ట్రోలింగ్‌.

Anil kumar poka

|

Updated on: Jun 22, 2024 | 7:50 PM

ఇటీవల మధ్యప్రదేశ్‌ నుంచి కేంద్ర మంత్రిగా ఎంపికైన సావిత్రి ఠాకూర్‌ గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మోదీ ప్రభుత్వంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఎంపికైన సావిత్రి ఠాకూర్ బేటీ బచావో బేటీ పఢావో నినాదాన్ని సరిగ్గా రాయలేకపోయారు. ఇంటర్ పాస్ అయిన మంత్రి స్లోగన్ సరిగ్గా రాయలేకపోవడంతో అనేక మంది ఆమెను విమర్శిస్తున్నారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌ నుంచి కేంద్ర మంత్రిగా ఎంపికైన సావిత్రి ఠాకూర్‌ గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మోదీ ప్రభుత్వంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఎంపికైన సావిత్రి ఠాకూర్ బేటీ బచావో బేటీ పఢావో నినాదాన్ని సరిగ్గా రాయలేకపోయారు. ఇంటర్ పాస్ అయిన మంత్రి స్లోగన్ సరిగ్గా రాయలేకపోవడంతో అనేక మంది ఆమెను విమర్శిస్తున్నారు. అసలు మంత్రి ఏం చదువుకున్నారని కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు ప్రశ్నిస్తున్నారు. ధార్ జిల్లాలో నిర్వహించిన మూడు రోజుల ప్రవేశోత్సవ కార్యక్రమాన్ని మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రారంభించారు. ఆ నేపథ్యంలో ఆమె శిక్షా రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. దీనికి ముందు ప్రచార రథం వెనుక ఉన్న బోర్డుపై ‘బేటీ బచావో-బేటీ పఢావో’ అనే నినాదాన్ని రాసి సంతకం చేయాల్సిందిగా సిబ్బంది ఆమెను అభ్యర్థించారు. ఆ అభ్యర్థనపై సావిత్రి ఠాకూర్ లేచి నినాదం చేశారు. కానీ బోర్డుపై బేటీ బచావో బేటీ పఢావో అనే నినాదాన్ని రాయాల్సి ఉండగా.. ఆమె బేడీ పడావో బచావ్ అని రాశారు. కేంద్ర మంత్రి నినాదం తప్పుగా రాసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.