AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Crime: ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్తే..

గుంటూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కాసులకు కక్కుర్తి పడి ఓ కేటుగాడు తన ప్రేయసినే హతమార్చాడు. ఆమె నుంచి డబ్బులు కాజేసేందుకు ఉద్యోగం పేరుతో నాటకం ఆడాడు. తీరా ఆమె డబ్బుల గురించి నిలదీయడంతో ఫ్రెండ్‌తో కలిసి పక్కా ప్లాన్ వేసి హత్య చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Andhra Crime: ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్తే..
Andhra Crime
T Nagaraju
| Edited By: |

Updated on: Apr 16, 2026 | 2:08 PM

Share

పాత గుంటూరుకు చెందిన రమాదేవికి పన్నెండేళ్ల క్రితం పొన్నూరుకు చెందిన వ్యక్తితో వివాహం అయింది. అయితే భర్త చనిపోవడంతో కుమారులతో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శ్రీరంగపురానికి చెందిన న్యాయవాది సురేష్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత కొంతకాలంగా సురేష్ తో చనువుగా ఉంటుంది. అయితే రమాదేవి తల్లి వెంకాయమ్మ తన పొలం అమ్మగా వచ్చిన 25 లక్షల రూపాయలను కూతురు రమాదేవికి ఇచ్చింది. రమాదేవి వద్దకు డబ్బులు వచ్చాయని తెలుసుకున్న సురేష్ వాటిని కొట్టేయాలని ప్లాన్ వేశాడు. మామూలుగా అడిగితే పెద్ద మొత్తంలో డబ్బులివ్వదని గ్రహించిన సురేష్ ఉద్యోగం పేరుతో సరికొత్త నాటకానికి తెర దీశాడు.

రమాదేవికి ఉద్యోగం ఇప్పిస్తానని.. అయితే అందుకు పది లక్షల రూపాయల వరకూ ఖర్చవుతాయని చెప్పాడు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో రమాదేవి మొదట పదిలక్షల రూపాయలు సురేష్ కి ఇచ్చింది. తర్వాత పలు దఫాలుగా మరొక ఎనిమిది లక్షల రూపాయలను లాయర్ తీసుకున్నాడు. కొద్దీ రోజుల తర్వాత డబ్బులు ఏమయ్యాయంటూ రమాదేవిని కొడుకులు అడగటం మొదలు పెట్టారు. అటు ఉద్యోగం రాకపోవడంతో రమాదేవి సురేష్ పై ఒత్తిడి తీసుకురా సాగింది. పద్దెనిమిది లక్షల రూపాయలను తన సొంతానికి వాడుకున్న సురేష్ వాటిని తిరిగి చెల్లించలేకపోయాడు. ఇక రమాదేవి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఏమి చేయాలో అర్థం కాక ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.

అనుకున్న ప్రకారం తన స్నేహితుడైన కోపల్లి శేఖర్‌తో కలిసి ఫిబ్రవరి 20న శ్రీశైలం వెళదామంటూ రమాదేవికి ఫోన్ చేశాడు సురేష్.. సంగం జాగర్లమూడి కాలువ వద్దకు రావాలని ఆమె చెప్పాడు. అది నిజమేనని నమ్మిన రమాదేవి కాలువ వద్దకు రాగానే వెనకనుంచి వచ్చి ఆమెను కాలువలోకి తోసేశారు. ఆమె బయటకు వచ్చేందుకు ప్రత్నించగా కర్రతో కొడుతూ మళ్లీ ఆమెను లోపలికి తోసేశారు. దీంతో నీటమునిగి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అయితే కూతురు కనిపించకపోవడంతో రమాదేవి తల్లి వెంకాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు తర్వాత హత్య కేసుగా మార్చారు. రమాదేవి ఖాతా నుండి పెద్ద మొత్తంలో నగదు బదిలీ కావడం, ఫోన్ లో ఎక్కువుగా సురేష్ తో మాట్లాడినట్లు ఆధారాలుండటంతో సురేష్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతనితో పాటు స్నేహితుడైన శేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా