Andhra News: కనడమే వాళ్ల పాపమా? డబ్బు ఇవ్వలేదని.. అర్థరాత్రి కొడుకు ఏం చేశాడంటే..
రోజురోజుకూ మానవ సంబధాలు మంటకలుస్తున్నాయి. డబ్బు మోజులో పడి రక్త సంబంధాలనే తెంచుకుంటున్నారు కుటుంబ సభ్యులు. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు ఒక కొడుకు. ఈ దాడిలో తీవ్రంగా గాపడిన తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

గుంటూరు రూరల్ మండలం రెడ్డిపాలెంలోని మథర్ థెరిస్సా కాలనీలో నివాసం ఉండే శేషుబాబు బూట్ పాలిష్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య అన్నపూర్ణ హోటల్ పనిచేస్తుంటుంది. వీరికి ఐదుగురు సంతానం. వీరి చిన్న కుమారుడు సాయి నాగ గణేష్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ళ కిందట నాగ గణేష్ కు పల్నాడు జిల్లా జంగమహేశ్వర పురానికి చెందిన తిరుపతమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరూ సంతానం. అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధులు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదిన తిరుపతమ్మతో పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్య వెళ్లిపోవడంతో పుల్‌గా మద్యం సేవించిన నాగ గణేష్ రాత్రి తల్లి అన్నపూర్ణ వద్దకు వచ్చాడు. తల్లి దాచుకున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉండటంతో తల్లి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. డబ్బులు ఇవ్వకపోవడంతో నాగ గణేష్ తల్లిపై దాడి చేశాడు. దీంతో ఆమె భయపడిపోయి పక్కనే ఉన్న కమాల్ బీ ఇంటికి వెళ్లి తల దాచుకుంది. ఈ విషయం తెలుసుకున్న శేషు బాబు కూడా భార్యతో పాటే కమాల్ బీ ఇంటికి వెళ్లాడు. అయితే అర్ధరాత్రి మద్యం సేవించిన నాగ గణేష్ మరోసారి తల్లిదండ్రులు తల దాచుకున్న ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ఘర్షణ పడ్డాడు.
ఈ క్రమంలోనే తల్లిపై దాడి చేస్తుండగా తండ్రి శేషుబాబు అడ్డుపోయాడు. దీంతో కోపంతో ఊగిపోయిన నాగ గణేష్ తండ్రి తలపై బండ రాయితో మోది చంపేశాడు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్థానికులు కేకలు వేయడంతో నాగ గణేష్ అక్కడ నుండి పారిపోయాడు. తల్లి అన్నపూర్ణను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నాగ గణేష్ కోసం గాలిస్తున్నారు. కన్న కొడుకే తల్లిదండ్రులపై దాడి చేసి తండ్రిని హత్య చేయడంతో కాలనీ విషాద ఛాయలు అలముకున్నాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియనితనంలో హత్య చేసిన నాగ గణేష్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
