Andhra: శభాష్రా చిన్నోడా.. ఆడుకుంటూ నీటిగుంటలో పడిన తమ్ముడు.. ఏడేళ్ల అన్న ఏం చేశాడంటే..
ఇద్దరు చిన్నారులు ఇంటిముందు ఆడుకుంటున్నారు. అంతలో ఓ చిన్నారి ఇంటి ముందు కుళాయి పైపులైన్లు మరమ్మత్తుల కోసం తవ్విన గుంతలో పడి.. కొట్టుమిట్టాడుతుండగా.. అక్కడే ఉన్న ఏడేళ్ల అన్న.. వెంటనే తమ్ముడు చెయ్యి పట్టుకుని బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. అధికారుల నిర్లక్ష్యంతో ఇదంతా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇద్దరు చిన్నారులు ఇంటిముందు ఆడుకుంటున్నారు. అంతలో ఓ చిన్నారి ఇంటి ముందు కుళాయి పైపులైన్లు మరమ్మత్తుల కోసం తవ్విన గుంతలో పడి.. కొట్టుమిట్టాడుతుండగా.. అక్కడే ఉన్న ఏడేళ్ల అన్న.. వెంటనే తమ్ముడు చెయ్యి పట్టుకుని బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో ఇదంతా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉరవకొండలోని భద్రప్ప బావి వీధిలో 15 రోజుల క్రితం కులాయి మరమ్మత్తులో కోసం తవ్విన గుంతలో ఐదేళ్ల అల్లుడు ప్రణీత్ ఆడుకుంటూ పడ్డాడు. కుళాయి పైపులు మరమ్మత్తులు చేసేందుకు తవ్విన గుంతలు పైప్ లైన్ ల నుంచి లీకేజ్ అయిన నీరు చేరడంతో.. తవ్విన గుంట నిండా నీళ్లు చేరాయి. అదే నీటి గుంతలో పడి మునిగిపోతుండగా తమ్ముడు ప్రణీత్ ను చేయి పట్టుకొని ఏడేళ్ల అన్న లింగేష్ కాపాడాడు.
లీకేజీ నీటితో నిండిన గుంతలో పడి ఐదేళ్ల బాలుడు ప్రణీత్.. కొద్దిపాటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.. గుంతలు తవ్వి బాలుడి ప్రాణాల మీదకు తెచ్చిన అధికారులు నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు.. కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల క్రితం గుంతలు తవ్వి పూడ్చకుండా అలాగే వదిలేసారని ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చూడండి..
విషయం తెలుసుకున్న ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, సిబ్బందిని బాలుడు తల్లిదండ్రులతో పాటు స్థానికులు నిలదీశారు. గుంతలు తవ్వి అలా వదిలేస్తే.. చిన్నపిల్లలు తెలియక ప్రమాదవశాత్తు వాటిలో పడి ప్రాణాలు కోల్పోతే ఎవరిది బాధ్యత అంటూ.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
