Guntur District: సూసైడ్ చేసుకుంటున్నట్లు స్నేహితులకు యువకుడి ఫోన్.. సీన్ కట్ చేస్తే..

ప్రేమించిన అమ్మాయి.. ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు పోలీసులను ఆశ్రయించారు.

Guntur District: సూసైడ్ చేసుకుంటున్నట్లు స్నేహితులకు యువకుడి ఫోన్.. సీన్ కట్ చేస్తే..
Macherla Police
Follow us

|

Updated on: Jan 29, 2022 | 12:55 PM

Macherla: మాచర్ల సమీపంలోని న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాల(Newton’s Institute of Engineering)లో అనంతపురానికి చెందిన తేజ అనే యువకుడు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుచున్నాడు. గత కొంతకాలంగా ఒక అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆ అమ్మాయి అతని ప్రేమని తిరస్కరించింది. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మాచర్ల నుండి దూరంగా వెళ్ళిపోయి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే తాను ఎక్కడ ఉన్నది స్నేహితులకు చెప్పలేదు. వెంటనే స్పందించిన స్నేహితులు మాచర్ల సీఐ సుబ్బారావు వద్దకు వెళ్ళారు. తమ స్నేహితుడు ఆత్మహత్య చేసువాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏ ఫోన్ నంబర్ నుండి ఫోన్ వచ్చిందో తెలుసుకున్న సీఐ తన సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అలెర్ట్ చేశారు. ఆ యువకుడి నంబర్ ను అన్ని స్టేషన్లకు పంపించారు. రెంటచింతల(Rentachintala ) ఎస్సై సురేష్ ఫోన్ నంబర్ ట్రేస్ చేయగా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నట్లు తేలింది. వెంటనే తన సిబ్బందితో రైల్వే స్టేషన్ కు చేరుకొని యువకుడు కోసం గాలించారు. ఆత్మహత్య చేసుకోవటానికి సిద్దంగా ఉన్న యువకుడిని గుర్తించి ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్నారు.

ఆ తరువాత ఆ యువకుడితో మాట్లాడి..ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పని అర్థమయ్యేలా చెప్పారు. ప్రేమ విఫలం అవడం అంటే జీవితంలో ఓడిపోయినట్లు కాదని, మున్ముందు సాధించాల్సినవి చాలా ఉన్నాయని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అతడిని జాగ్రత్తగా చూసుకోవాలని.. స్నేహితులకు సూచించారు.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

Also Read:  ఆ ప్రాంతంలో మామిడి, జామచెట్లకు గుమ్మడికాయలు.. ఈ విచిత్రం వెనుక సీక్రెట్ ఇదే..

శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు.. దిగి చెక్ చేయగా అద్భుతం

Latest Articles