Gun Firing on YSRCP Leader: ఆంధ్రప్రదేశ్‌లో కాల్పులు కలకలం రేపాయి. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం, ముళ్లగూరివాండ్లపల్లిలో సోమవారం రాత్రి ఈ కాల్పుల ఘటన జరిగింది. పీలేరు అగ్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్, వైఎస్ఆర్‌సీపీ నాయకుడు మల్లిఖార్జునపై ఆగంతకులు.. నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మల్లిఖార్జున్ గాయాలతో బయటపడ్డారు. మల్లికార్జున కాలికి గాయమైంది. చికిత్స కోసం మల్లికార్జునను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ముల్లగూరిపల్లిలో వైసీపీ నేత మల్లికార్జున సోమవారం రాత్రి ఇంటి ముందు కూర్చుని ఉండగా.. కొందరు దుండగలు వచ్చి అనూహ్యంగా కాల్పులు జరిపి పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పీలేరు పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షలే ఈ కాల్పులకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..