Andhra: ‘చెత్త’పనికి వినూత్న ఐడియాతో చెక్ పెట్టిన మహిళ.. శభాష్
రోడ్డుపక్కన జనాలు చెత్త వేయకుండా.. ఈమెకు వచ్చిన ఆలోచన సూపర్ అనాల్సిందే. ఇదేదో బావుంది కదా.. మీరు కూడా మీ ప్రాంతాల్లో చెత్త సమస్యకు ఇలా చెక్ పెట్టవచ్చు. మంగళగిరి గౌతమ బుద్ధా రోడ్డులో రోడ్డు పక్కన చెత్త పడేస్తున్నారని.. ఆమె ఇలా చేశారు.

రోడ్లుపై చెత్త వేయడం జనాలకు అలవాటైపోయింది. అది చెత్త పని అని చెప్పినా.. ఫైన్లు వేస్తామని.. గ్రామ పంచాయితీలు, మున్సిపల్, నగర్ కార్పోరేషన్లు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదు. ఇంటింటికి వచ్చి చెత్త సేకరిస్తున్నా.. వారిలో ఈ బద్దకం ఏంటో అర్థం కావడం లేదు. ఇది కేవలం శానిటేషన్ సమస్య మాత్రమే కాదు.. ఇలా చెత్త పేరుకుపోతే వ్యాధులకు దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. అయినా కొందరు పట్టించుకోవడం లేదు.
జనం మాట వినడం లేదని గుంటూరు జిల్లాలో మాత్రం ఓ మహిళ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. జనాలు ఆ ప్రాంతంలో చెత్త వేయకుండా ఆపేందుకు ఆమె వేసిన ఐడియాను అందరూ ప్రశంసిస్తున్నారు. మంగళగిరి గౌతమ బుద్ధా రోడ్డులో.. రహదారి పక్కన జనాలు వేస్ట్ అంతా తీసుకొచ్చి పడేస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది.. ఎప్పటికప్పుడు అక్కడి నుంచి చెత్తను తొలగించి.. హెచ్చరిక బోర్డులు పెట్టినా జనంలో మార్పు రావడం లేదు. ఎక్కడెక్కడి నుంచో చెత్తను తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్లిపోతున్నారు.
ఈ క్రమంలో వారికి అడ్డుకట్ట వేసేందుకు స్వచ్ఛాంధ్ర బ్రాండ్ అంబాసిడర్ యడ్ల దివ్య సరికొత్త ఆలోచన చేశారు. ఒకటో వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి దివ్య చెత్త వేసే ప్రాంతాన్ని క్లీన్ చేశారు. ఆ తర్వాత శుభ్రం చేసి ప్రాంతంలో తులసి చెట్టు నాటారు. తులసి కోటను ప్రతిష్ఠించి.. అందంగా.. పసుపు, కుంకుమతో పూజలు చేశారు. దీంతో అక్కడ ఎవరూ చెత్త వేయడం లేదు. దీంతో ఆ ప్రాంతం స్వచ్చతను సంతరించుకుంది. ఇలాంటి మంచి పనికి పూనుుకన్న స్వచ్ఛాంధ్ర బ్రాండ్ అంబాసిడర్ యడ్ల దివ్యతో పాటుగా సచివాలయ సిబ్బందిని.. ఉన్నతాధికారులు అభినందించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
