AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దసరా పండుగ వేళ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పిన APSRTC.. ఆ ఛార్జీలు లేవ్

దసరా పండక్కి ఇంటికి సొంతూర్లకు వెళ్లాలనుకునేవారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక బస్సులు నడపబోతున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు....

Andhra Pradesh: దసరా పండుగ వేళ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పిన APSRTC.. ఆ ఛార్జీలు లేవ్
Apsrtc
Ram Naramaneni
| Edited By: |

Updated on: Sep 20, 2022 | 10:12 AM

Share

Dasara Festival: దసరా అంటేనే ప్రయాణీకులు రద్దీ. అందరూ సొంతూర్లకు పయనమవుతారు. నెలల ముందు బుక్ చేసుకుంటే తప్ప.. బస్సు, ట్రైన్లలో సీట్లు టికెట్లు దొరకవు. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి తెగబడతాయి. ఈ క్రమంలోనే ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు స్పష్టం చేసింది. విజయవాడ నుండి ఏపీతో పాటు హైదరాబాద్(Hyderabad) , చెన్నై(Chennai), బెంగుళూరు సహా పలు ప్రాంతాలకు 1081 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది. ఈనెల 29 నుండి అక్టోబర్ 10 వరుకు నడవనున్న ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ఇక్కడ పేద, మధ్య తరగతి వారికి ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. ఈ ప్రత్యేక బస్సులో ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ధృవీకరించారు. కాగా ప్రత్యేక బస్సుల్లో కూడా రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని ప్రకటించారు. ఇక ప్రత్యేక బస్సులకు సంబంధించి ఎటువంటి వివరాలు కావాలన్నా.. APRSRTC వెబ్‌సైట్ సందర్శించాలని అధికారులు కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us