Andhra Pradesh: పుష్ప సినిమా రేంజ్‌లో మాస్టర్ ప్లాన్.. చూసి పోలీసులకు కూడా కళ్ళు బైర్లుకమ్మాయి.. వామ్మో..

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. పుష్పా సినిమా స్టైల్లో మాదకద్రవ్యాలను తరలిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ వర్గాలను మస్కా కొట్టి గంజాయి సరిహద్దులు దాటించేస్తున్నారు

Andhra Pradesh: పుష్ప సినిమా రేంజ్‌లో మాస్టర్ ప్లాన్.. చూసి పోలీసులకు కూడా కళ్ళు బైర్లుకమ్మాయి.. వామ్మో..
Ganjai Smuggling
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 27, 2022 | 9:41 AM

Drugs smuggling: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. పుష్పా సినిమా స్టైల్లో మాదకద్రవ్యాలను తరలిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ వర్గాలను మస్కా కొట్టి గంజాయి సరిహద్దులు దాటించేస్తున్నారు. సినీ స్టైల్లో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ల ఐడియా.. తాజాగా, అధికారులకే మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. బోలెరో టాప్ ప్రత్యేక అరను ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టును.. రట్టు చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఈబీ పోలీసులు. డుంబ్రిగూడ మండలం కించుమండలో దగ్గర గంజాయి ముఠాను పట్టుకున్నారు ఎస్ఈబీ పోలీసులు. అనుమానాస్పదంగా వెళుతున్న బొలెరోను ఆపి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో వాహనంలో ఉన్న వారిని ప్రశ్నిస్తుండగా.. ఎక్కడో చిన్న అనుమానం రావడంతో మళ్లీ వాహనాన్ని క్షుణంగా పరిశీలించారు.

బొలెరో వాహనంపై ప్రత్యేక అరను ఏర్పాటు చేసి అందులో గంజాయి చిన్న బస్తాలను ఉంచారు. ఈ క్రమంలో ఏదో కుక్కినట్టు కనిపించడంతో.. పోలీసులు మళ్లీ చెక్ చెసి.. గంజా బాక్సులను గుర్తించారు. సినిమా స్టైల్ లో స్మగ్లింగ్ పాల్పడటాన్ని చూసి అవాక్కయ్యారు. 130 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోరాపుట్ కు చెందిన పాంగి మహేశ్వర్, డుంబ్రిగూడ కు చెందిన కిల్లో రమేష్ ను అరెస్ట్ చేశారు.

Drugs

Drugs

వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ స్మగ్లింగ్ వెనుక ఎవరెవరి హస్తం ఉందన్న విషయాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..