Andhra Pradesh: విజయవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం.. నేరాలకు అడ్డాగా శివారు ప్రాంతాలు
Andhra Pradesh: విజయవాడ నగర శివారు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు ..
Andhra Pradesh: విజయవాడ నగర శివారు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే నగరంలో అరాచకాలు సృష్టిస్తున్న బ్లేడ్ బ్యాచ్ ముఠా వీరంగం మరవకముందే మరోసారి గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. విజయవాడ టూటౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వీరంగం సృష్టించిన గంజాయి బ్యాచ్.. ఐదు బైక్‌లకు నిప్పు పెట్టారు. లంబాడిపేట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఐదు బైక్‌లను తగలబెట్టారు.
నగర శివారు ప్రాంతం కావడంతో ఇక్కడ నిత్యం గంజాయి మత్తులో కొందరు యువకులు అల్లర్లకు పాల్పడతున్నారని స్థానికులు చెబుతున్నారు. గంజాయి విషయాన్ని పోలీసులకు తాము చెబుతున్నట్లు అనుమానించే దుండగుల.. బైక్‌లను తగులబెట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్ కొత్తపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి