Nellore: ఇదేంది మాస్టారూ! పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన స్టూడెంట్స్‌ ఇలా చేశారు.. సీన్ కట్ చేస్తే!

క్లాసులో పుస్తకాలతో కుస్తీ పడాల్సిన స్టూడెంట్స్.. మెరిట్‌లు సాధించి మంచి ఉద్యోగాలు పొందాలనుకోవాల్సిన స్టూడెంట్స్ ఇలా చేస్తారా.. అసలు ఏం జరిగిందంటే..

Nellore: ఇదేంది మాస్టారూ! పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన స్టూడెంట్స్‌ ఇలా చేశారు.. సీన్ కట్ చేస్తే!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: May 25, 2022 | 7:55 AM

వాళ్లంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్.. అవును విద్యార్ధులంటే ఏం చెయ్యాలి.. బుద్దిగా లెక్చరర్ చెప్పిన పాఠాలు వినాలి. పుస్తకాలతో కుస్తీ పడాలి. అయితే వీళ్లు అలా కాదు.. వీధి రౌడీల్లా చెలరేగిపోయారు. కత్తులు, కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. గూడూరు ఆడిశంకర ఇంజనీరింగ్‌ కాలేజీలో మరోసారి గ్రూప్‌ వార్‌ జరిగింది. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన స్టూడెంట్స్‌… కత్తులు, కర్రలు, రాడ్లు, రాళ్లతో వీరంగం ఆడారు. రెండు వర్గాలుగా విడిపోయిన ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. వీధిరౌడీల్లా కొట్టేసుకున్నారు. అచ్చం సినిమాల్లో చూపించినట్లుగా గ్యాంగ్‌ వార్‌కి దిగారు. వందల మంది స్టూడెంట్స్‌… గ్రౌండ్‌లోకి వచ్చి దాడులు చేసుకున్నారు.

ఆ కాలేజీలో కొన్నాళ్లుగా బీటెక్‌, పాలిటెక్నిక్‌ స్టూడెంట్స్‌ మధ్య గొడవలు జరుగుతున్నాయ్‌. ఆ గొడవలు కాస్తా ఇప్పుడు తీవ్రరూపం దాల్చి కొట్టుకునేవరకూ వచ్చింది. గూడూరు ఆడిశంకర ఇంజనీరింగ్‌ కాలేజీలో గతంలోనూ ఇలాంటి ఇన్సిడెంట్స్‌ జరిగాయ్‌. విద్యార్ధులు అనేకసార్లు గ్యాంగ్‌ వార్‌కి దిగారు. రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే, ఇవన్నీ బయటికి రాకుండా కాలేజీ యాజమాన్యం గుట్టుగా ఉంచుతూ వస్తోంది. కొన్ని ఇన్సిడెంట్స్‌… పోలీసుల వరకూ వచ్చినా, విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపిన సందర్భాలున్నాయ్‌. కేసులు నమోదు చేస్తే స్టూడెంట్స్‌ ఫ్యూచర్‌పై ఎఫెక్ట్‌ పడుతుందన్న ఉద్దేశంలో సర్దిచెబుతూ వచ్చారు. ఇప్పుడు, మరోసారి స్టూడెంట్స్‌ గ్యాంగ్‌ వార్‌కి దిగడం కాలేజీలోనే కౌన్సిలింగ్‌ నిర్వహించారు పోలీసులు. మళ్లీ రిపీటైతే, ఈసారి కేసులు నమోదు చేస్తామంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.