Chittoor Road Accident: రక్తమోడిన నగరి రోడ్డు.. నలుగురు మృతి. 10 మందికి గాయాలు

చీకట్లో ప్రయాణం అంటేనే భయపడాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో చెప్పలేం. తిరుపతిలో అదే జరిగింది. తిరుపతి జిల్లా నగిరి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై హైవేపై తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు బస్సు ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తున్న సమయంలో ఎదురుగా ఓ లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Chittoor Road Accident:  రక్తమోడిన నగరి రోడ్డు.. నలుగురు మృతి. 10 మందికి గాయాలు
Bus Accident

Edited By:

Updated on: Feb 03, 2025 | 7:59 AM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
తిరుపతి చెన్నై జాతీయ రహదారిలోని నగరి ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. నగరి నుంచి తిరుపతికి వెళుతున్న ఒక ప్రైవేటు బస్సు.. ఓ ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తున్న సమయంలో ఎదురుగా ఓ లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లింది. . వేగంగా ఢీకొనడంతో బస్సులో ఒకవైపు కూర్చున్న ప్రయాణికులే ప్రమాదానికి గురయ్యారు. నలుగురు అక్కడికక్కడే మృతిచెందిగా మరికొద్దిమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో వడమాలపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పార్థసారథి, రాజేంద్ర నాయుడు తోపాటు తిరుపతికి చెందిన 8 ఏళ్ల మణికంఠ తో పాటు 60 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తమిళనాడుకు చెందిన చిన్నమలై పరిస్థితి విషమంగా ఉండగా..  క్షతగాత్రులను నగరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై మంత్రి ఆరా…

ఇక రోడ్డు ప్రమాదం ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంపై జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి రాంప్రసాద్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us