AP Politics: వైఎస్ఆర్సీపీని వీడిన మాజీ కేంద్ర మంత్రి.. సీఎం జగన్‎కు రాజీనామా లేఖ..

|

Apr 03, 2024 | 4:05 PM

వైఎస్ఆర్సీపీకు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని నేరుగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే పంపించారు. ఏపీలో రాజకీయాలు చేరికలు, చీలికలు, పొత్తులు, ఎత్తులు, ప్రచారాలు, సభలతో వాడివేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది.

AP Politics: వైఎస్ఆర్సీపీని వీడిన మాజీ కేంద్ర మంత్రి.. సీఎం జగన్‎కు రాజీనామా లేఖ..
Killi Kruparani
Follow us on

వైఎస్ఆర్సీపీకు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని నేరుగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే పంపించారు. ఏపీలో రాజకీయాలు చేరికలు, చీలికలు, పొత్తులు, ఎత్తులు, ప్రచారాలు, సభలతో వాడివేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. పార్టీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సుయాత్రలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా చేయడం ఆ నియోజకవర్గంలో కాస్త ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కిల్లి కృపారాణి 2009 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. వైఎస్ఆర్ హయాంలో ఈమె కాంగ్రెపార్టీలో మంత్రి పాత్ర పోషించారు. అప్పట్లో తనకు టీడీపీ నుంచి ప్రత్యర్థిగా బరిలో నిలిచిన ఎర్రన్నాయుడు పై పోటీ చేసి ఘన విజయం సాధించారు. కీలక నేతను ఢీ కొట్టడంతో తొలి ప్రయత్నంలోనే మంత్రిపదవిని సాధించగలిగారు.

ఆ తరువాత వైఎస్ మరణానంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె స్థాయికి జిల్లా అధ్యక్షురాలి పదవిని కూడా ఇచ్చింది అధిష్ఠానం. అయితే గత కొంత కాలంగా తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆమె చెబుతున్న మాట. దీంతోనే పార్టీ వేడేలా నిర్ణయం తీసుకున్నారని ఆమె సమీపవర్గాలు చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో అంటే 2019లో ప్రత్యక్షంగా పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వకపోయినా రాజ్యసభ అయినా వస్తుందని ఆమె ఆశపడ్డారు. అప్పుడు అవకాశం దక్కలేదు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా అభ్యర్థిగా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ వైసీపీ అధిష్టానం ఆమెకు అవకాశం ఇవ్వకపోవడంతో.. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో అయినా తన పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ వస్తుందని ఆశించారు. కానీ చివరికి ఎక్కడా ఆమె పేరు లిస్ట్ లో కనిపించలేదు. అందుకే మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీ వీడుతున్నట్లు బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమె కుమారుడు విక్రాంత్ కు టెక్కలి నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇస్తామన్న హామీతో హస్తం పార్టీతో చెయ్యి కలిపేందుకు సిద్దమైనట్లు సమాచారం. అయితే త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..