Kodali Nani: ఎన్టీఆర్‌ వారసులు పార్టీలోకి వస్తుంటే వారికి ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయి.. కొడాలి నాని ఫైర్..

టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర యువగళంపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పాదయాత్ర చేయడం కంటే ప్రశాంతంగా పడుకోవడమే మంచిదని సెటైర్ వేశారు...

Kodali Nani: ఎన్టీఆర్‌ వారసులు పార్టీలోకి వస్తుంటే వారికి ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయి.. కొడాలి నాని ఫైర్..
Kodali Nani
Follow us

|

Updated on: Feb 04, 2023 | 8:29 PM

టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర యువగళంపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పాదయాత్ర చేయడం కంటే ప్రశాంతంగా పడుకోవడమే మంచిదని సెటైర్ వేశారు. ముఖ్యమంత్రి జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి.. రోజుకు 10 కిలోమీటర్లు కూడా నడవడం లేదని ఎద్దేవా చేశారు. దివంగత నేత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. సీఎం పదవి లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ వారసులు పార్టీలోకి వస్తుంటే వారికి ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయని ప్రశ్నించారు. హరికృష్ణ డిమాండ్‌ చేసినా ఎన్టీఆర్‌ మృతిపై ఎందుకు విచారణ చేయలేదని, ఎన్టీఆర్‌ చనిపోతే ఎందుకు పోస్ట్‌మార్టం చేయించలేదని నిలదీశారు. ఎన్టీఆర్‌ మరణం వెనుక గుట్టు తేల్చాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానన్నారు కొడాలి నాని.

చంద్రబాబు పాదయాత్ర చేయలేక కొడుకును పంపాడు. జనం లేక లోకేశ్ ఖాళీ కుర్చీలకు స్పీచ్‌లు ఇస్తున్నాడు. నిబంధనలు పాటించమంటే పోలీసులను తిడుతున్నాడు. దత్తపుత్రుడు కూడా హైదరాబాద్‌కు వలస వెళ్లిపోయాడు. సీఎం జగన్‌తో మాట్లాడాలంటే అక్కడి సిబ్బందికే ఫోన్‌ చేయాలి. నవీన్‌కు అవినాష్‌ రెడ్డి ఫోన్‌ చేశారంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వివేకా హత్య జరిగినప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారు. చంద్రబాబు ఫోన్‌ కాల్స్‌పై సీబీఐ విచారణ జరపాలి.

      – కొడాలి నాని, ఏపీ మాజీ మంత్రి

ఇవి కూడా చదవండి

ఈ ఉదయం పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైంది. క్యాంప్ సైట్ వద్ద పాదయాత్ర ప్రారంభమయ్యే ముందు సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం కొనసాగింది. కొండ్రాజుకాల్వ వద్ద మధ్యాహ్న భోజన విరామం అనంతరం రాత్రికి తవణంపల్లి విడిది కేంద్రంలో లోకేశ్ బస చేస్తారు. ఇప్పటి వరకు లోకేశ్ పాదయాత్ర 100.8 కిలోమీటర్లు కొనసాగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..