YS Sharmila: ఏపీలో మొదలైన అసమ్మతి రాగం.. ఆ పదవి వైఎస్ షర్మిలకు ఇవ్వొద్దంటున్న సీనియర్ నేతలు
వైఎస్ షర్మిల.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా గుర్తింపు ఉన్న మహిళ. జగన్ సోదరిగా రాజకీయంగా బాగా పాపులర్ అయ్యారు. వైఎస్ఆర్టీపీ అంటూ తెలంగాణలో పార్టీ పెట్టి సుదీర్ఘకాలం పాదయాత్రలు చేశారు. అయితే అనుకున్నంతమేర సక్సెస్ కాలేకపోయారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఈ వారంలోనే ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వైఎస్ షర్మిల.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా గుర్తింపు ఉన్న మహిళ. జగన్ సోదరిగా రాజకీయంగా బాగా పాపులర్ అయ్యారు. వైఎస్ఆర్టీపీ అంటూ తెలంగాణలో పార్టీ పెట్టి సుదీర్ఘకాలం పాదయాత్రలు చేశారు. అయితే అనుకున్నంతమేర సక్సెస్ కాలేకపోయారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఈ వారంలోనే ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈమెను ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసేలా పదవిని కేటాయిస్తారన్న వార్తలు జోరుగా వినిపిస్తోంది. ఈ తరుణంలో షర్మిల కాంగ్రెస్‌లో ఉంటే ఓకే.. కానీ కీలకమైన ఆ పదవి మాత్రం ఇవ్వొద్దంటూ స్పీడ్ బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేత హర్షకుమార్. మరి ఈ మాజీ ఎంపీ విన్నపాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందా?
వైఎస్‌ఆర్టీపీని విలీనం చేసి కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏపీసీసీ చీఫ్‌గా షర్మిలను నియమిస్తారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ షర్మిలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని అధిష్టానానికి సూచించారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్న షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీకే డ్యామేజ్ జరుగుతుందనేది ఆయన వాదన. జగన్, షర్మిల ఒక్కటేనని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము సేఫ్ గా ఉండేందుకే చెరో పార్టీ ఎంచుకున్నట్లు హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు పీసీసీ ఛీఫ్ బదులుగా జాతీయ స్ధాయి పదవి ఇవ్వాలన్నారు. ఏఐసీసీ పదవి ఇచ్చి, స్టార్ క్యాంపెనర్ గా ఆమె సేవలు దేశవ్యాప్తంగా వాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు మాత్రం అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతానని ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




