APPSC Group 2 Exam Date: ఫిబ్రవరి 25వ తేదీన గ్రూప్ 2 ప్రాథమిక రాత పరీక్ష.. ఒక్కో పోస్టుకు 446 మంది పోటీ!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూపు-2 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఏపీపీఎస్సీ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణ జనవరి 10తో ముగియగా.. గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ దరఖాస్తులు నింపడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్‌పై ఒత్తిడి పెరిగినందున అనేక మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాజాగా..
అమరావతి, జనవరి 11: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూపు-2 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఏపీపీఎస్సీ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణ జనవరి 10తో ముగియగా.. గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ దరఖాస్తులు నింపడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్‌పై ఒత్తిడి పెరిగినందున అనేక మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాజాగా కమిషన్ దరఖాస్తు స్వీరణ గడువును జనవరి 17 వరకు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. తొలుత ప్రకటించిన విధంగానే ఫిబ్రవరి 25వ తేదీన రాత పరీక్ష యథాతథంగా జరుగుతుందని కమిషన్ స్పష్టం చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గతనెల 21 నుంచి ప్రారంభం అయ్యింది. ఇప్పటివరకు సుమారు 4 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది. మొత్తం గ్రూపు-2 కింద 897 పోస్టులు ఉండగా.. వీటిల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 వరకు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కొక్క పోస్టుకు 446 మంది పోటీపడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసేనాటికి మరింత మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విజయవాడ ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
విజయవాడలోని ఇగ్నో సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదలైంది. డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీజీ డిప్లమా, డిప్లమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ తదితర సర్టిఫికేట్ కోర్సుల్లో జనవరి-2024 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఈ మేరకు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం రీజినల్ డైరక్టర్ డా కె సుమలత ఓ ప్రకటనలో తెలిపారు. సీఏ కోర్సు చదువుతున్న విద్యార్థులు ఇగ్నోలో నేరుగా బీకాం, ఎంకాం కోర్సుల్లో చేరవచ్చని పేర్కొన్నారు. జనవరి 31, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
ఏపీపీఎస్సీ గ్రేడ్-2 పోస్టుల ప్రాథమిక జాబితా వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లోని జువైనల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్‌కు చెందిన జిల్లా ప్రొబెషన్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.