Kesineni Nani: ‘విజయవాడలో ముచ్చటగా మూడోసారి గెలిచి మీకు అంకితమిస్తా’: కేశినేని నాని

మొన్న టీడీపీని విమర్శించారు. నిన్న వైసీపీలో చేరారు. అలా పార్టీలో చేరారో లేదో.. ఇలా టికెట్ కేటాయించారు. దీంతో కేశినేని నాని జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఙతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కంప్లీట్‌గా ఎలక్షన్‌ మోడ్‌లోకి ఏపీ వెళ్లిపోయింది. నోటిఫికేషన్‌ కన్నా ముందే ఏపీలో రాజకీయం వేడెకెక్కుతోంది. ఎత్తులు పైఎత్తులు.. వ్యూహాలు పదనుదేలుతున్నాయి. ఇక విజయవాడ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Kesineni Nani: 'విజయవాడలో ముచ్చటగా మూడోసారి గెలిచి మీకు అంకితమిస్తా': కేశినేని నాని
Kesineni Nani
Follow us

|

Updated on: Jan 12, 2024 | 9:00 AM

మొన్న టీడీపీని విమర్శించారు. నిన్న వైసీపీలో చేరారు. అలా పార్టీలో చేరారో లేదో.. ఇలా టికెట్ కేటాయించారు. దీంతో కేశినేని నాని జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఙతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కంప్లీట్‌గా ఎలక్షన్‌ మోడ్‌లోకి ఏపీ వెళ్లిపోయింది. నోటిఫికేషన్‌ కన్నా ముందే ఏపీలో రాజకీయం వేడెకెక్కుతోంది. ఎత్తులు పైఎత్తులు.. వ్యూహాలు పదనుదేలుతున్నాయి. ఇక విజయవాడ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బెజవాడ రాజకీయం ఎప్పుడైనా హాట్ టాపిక్ గానే ఉంటుంది. టీడీపీతో గత కొంత కాలంగా పొసగని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవలే జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.

సీన్ కట్ చేస్తే.. మూడో జాబితాలో విజయవాడ ఎంపీ ఇంచార్జ్‌గా కేశినేని నాని పేరును ప్రకటించారు సీఎం జగన్. పార్టీలో చేరిన తొలిరోజు తనకు ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా నిర్వరిస్తానని చెప్పిన కేశినేని నానికి మూడో జాబితాలో తన పేరు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారాయన. ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్ ను ముచ్చటగా మూడోసారి గెలిచి మీకు అంకితం ఇస్తానన్నారు. అలాగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ జెండా ఎగిరేందుకు కీలక బాధ్యత తీసుకుంటానన్నారు. విజయవాడలో టీడీపీని 60 శాతం ఖాళీ చేస్తాననన్నారు కేశినేని నాని. ఈ క్రమంలో వలసలు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..