Andhra Pradesh: నాగలి పట్టి.. పొలం దున్నుతున్న ఈ మాజీ ఎంపీ ఎవరో గుర్తుపట్టారా..?

ఏరువాక రోజున తమ ఎద్దులను అలంకరించి, పొలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వ్యవసాయ పనులను రైతులు ప్రారంభిస్తారు.

Andhra Pradesh: నాగలి పట్టి.. పొలం దున్నుతున్న ఈ మాజీ ఎంపీ ఎవరో గుర్తుపట్టారా..?
Eruvaka
Follow us

|

Updated on: Jun 15, 2022 | 10:45 AM

eruvaka pournami: ప్రపంచానికి అన్నం పెట్టే రైతులు.. తమ వ్యవసాయ పనుల్ని ఏరువాక పున్నమినుంచే ప్రారంభిస్తారు. ఏరు అంటే నాగలి. వాక అంటే దుక్కి దున్నడం అని పెద్దలు చెబుతారు. తొలకరి పలకరించిన తరవాత, వచ్చే జ్యేష్ఠ పౌర్ణమినాడు రైతులు ఏరువాక జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉభయ రాష్ట్రాల్లో రైతులు ఏరువాకను ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. వర్షాలు విస్తారంగా కురిసి… పంటలు బాగా పండి.. అధిక దిగుబడి ఉండేలా చూడాలని రైతులు పుడమి తల్లిని వేడుకొన్నారు. గుంటూరు(Guntur)లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి ఏరువాక పున్నమిని ఘనంగా నిర్వహించారు. ఆయన పొలంలో స్వయంగా అరక కట్టి పొలం దున్నారు.  ఏరువాక రోజున తమ ఎద్దులను అలంకరించి, పొలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వ్యవసాయ పనులను రైతులు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ మోదుగుల కూడా తెలుగు దనాన్ని ప్రతిబింబిస్తూ తెల్లటి వస్త్రాలు, తలపాగా ధరించి అచ్చమైన రైతులా పొలం దున్నటం చూసి ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. యాంత్రీకరణ పెరిగి ట్రాక్టర్లు అందుబాటులోకి రావడంతో అన్ని సాంప్రదాయాల్లాగానే ఏరువాక అటకెక్కింది. అయితే  గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.