AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Media: సెలవు కోసం రూ. 10 వేలు జరిమానా కట్టిన యువకులు.. అసలు విషయం ఏంటంటే..

పాతకాలం సామెత ఎందంటే.. అబద్ధం ఆడిన అతికినట్టు ఉండాలి అంటారు. అవాస్తవాలు, అబద్దాలతో ప్రచారం పొందాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్లోనే లేని సింహాలను ఉన్నట్టు అబద్దమాడి పదివేల రూపాయల జరిమానా చెల్లించుకున్నాడు. నేషనల్ హైవే రోడ్డు పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన సొంత ఊరు మధ్యప్రదేశ్‎కు వెళ్లేందుకు పర్మిషన్ అడిగాడు.

Social Media: సెలవు కోసం రూ. 10 వేలు జరిమానా కట్టిన యువకులు.. అసలు విషయం ఏంటంటే..
Spreading False News On Social Media
J Y Nagi Reddy
| Edited By: Srikar T|

Updated on: Dec 27, 2023 | 12:05 AM

Share

పాతకాలం సామెత ఎందంటే.. అబద్ధం ఆడిన అతికినట్టు ఉండాలి అంటారు. అవాస్తవాలు, అబద్దాలతో ప్రచారం పొందాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్లోనే లేని సింహాలను ఉన్నట్టు అబద్దమాడి పదివేల రూపాయల జరిమానా చెల్లించుకున్నాడు. నేషనల్ హైవే రోడ్డు పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన సొంత ఊరు మధ్యప్రదేశ్‎కు వెళ్లేందుకు పర్మిషన్ అడిగాడు. సెలవు ఇచ్చేందుకు అధికారి నిరాకరించాడు. దీంతో ఎలాగైనా సెలవు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో ఒక తప్పుడు వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసి పనికి ఎవరూ రాకూడదని ఆలోచించాడు. అందుకుగాను హైవే పనులు జరుగుతున్న ప్రాంతంలో సింహం తిరుగుతుందని వీడియో పోస్ట్ చేశాడు. దీంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురై.. కొన్ని రోజులు పని ఆపేస్తారని ఆలోచించాడు. ఈ సమయంలో అతను ఊరికి వెళ్లవచ్చు అన్న ఉద్దేశంతో ఫేక్ వీడియో పెట్టి పదివేల రూపాయలు ఫైన్ వేయించుకున్నాడు.

పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామ శివారులోని సుంకులమ్మ ఆలయం వద్ద తెలుగు గంగ కట్ట గ్రావెల్ బిల్కు జాతీయ రహదారి విస్తరణ పనులకు వెళ్తున్నాడు. అయితే అక్కడ పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు సెలవు పెట్టి ఊరుకు వెళ్లడానికి తన పై అధికారి సెలవు అడగగా అతను సెలవు ఇవ్వలేదు. దీంతో ఎలాగైనా ఒక ఫేక్ వీడియో పెట్టి అక్కడ జరుగుతున్న పనులను ఆపి ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ ముగ్గురు ఎర్ర గూడూరు గ్రామ సమీపంలోని సుంకులమ్మ ఆలయం వద్ద సింహం వచ్చిందంటూ ఒక వీడియో సృష్టించి తన అధికారితో పాటు తోటి సిబ్బందికి షేర్ చేశారు. ఆ వీడియో కొన్ని నిమిషాల్లోనే పరిసర గ్రామాల్లో అందరికీ విస్తరించింది. దీంతో సమీప గ్రామాల్లో నివసించే స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే కొన్ని గ్రూపుల్లో చదువుకున్న వారు ఉండటంతో మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సింహాలే లేవని.. ఇవన్నీ తప్పుడు వార్తలని మెజేస్ పెట్టారు.

అయితే రాత్రికి వైరల్ అయిన ఈ వార్తపై ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. ఉదయం ఎర్రగూడురు గ్రామ సమీపంలోని తెలుగంగ కట్ట వద్దకు వెళ్లి పరిశీలించారు. ఇది తప్పుడు వీడియో అని నిర్దారణ చేసుకొని ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. ఈ వీడియో వైరల్ కావడానికి కారణమైన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని ఆత్మకూరు ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. వారిని విచారించగా మొత్తం విషయం బయటపడింది. సాయంత్రం వరకు విచారించిన ఫారెస్ట్ అధికారులు కేవలం సెలవు కోసమే ఈ వీడియో వైరల్ చేశారని ఒక నిర్ధారణకు వచ్చారు. ఇలా అసత్యాలను ప్రచారం చేసిన యువకులకు పదివేల రూపాయలు కాంపౌండ్ ఫీజు జరిమానాగా విధించారు. మరోసారి ఎవరైనా ఇలాంటి పోస్టులు పెడితే ఫైన్‎తో పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. సెలవు కోసం వచ్చిన తంట 10,000 పైన్ పడింది. వైరల్ చేసిన వారిలో ఇద్దరు యువకులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కాగా మరో యువకుడు స్థానికుడిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఎవరైనా సరే అసత్య ప్రచారాలను చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..