AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు.. స్థానికులు ఏం చేశారంటే?

ప్రొద్దుటూరులో అడవి శాఖ అధికారులు రాత్రికి రాత్రి వారాహి అమ్మవారి దేవాలయాన్ని కూల్చడం తీవ్ర కలకలం రేపింది. ఇది స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తించింది. అంతేకాకుండా విగ్రహాలను ఎలా పడితే అలా జెసిబితో నెట్టి వేయడంతో అవి చెల్లాచెదురుగా పడడిపోయాయి. దీంతో వారు మరింత ఆగ్రహించి నిరసనకు దిగారు. దీంతో అటవీశాఖ, రెవెన్యూ అధికారులు వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపచేశారు.

Watch: రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు.. స్థానికులు ఏం చేశారంటే?
Andhra News
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Feb 06, 2026 | 7:40 PM

Share

ఈ మధ్యకాలంలో అటవీశాఖ భూములలో ఉన్న దేవాలయాలను అధికారులు ఎక్కడబడితే అక్కడ కూల్చేల్తున్నారు. అయితే అనుమతులు లేకుండా దేవాలయాలు కడుతున్నారని అటవీశాఖ అధికారుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే నిన్న ప్రొద్దుటూరులో జరిగిన ఘటన మాత్రం అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సగం నిర్మాణంలో ఉన్న దేవాలయాన్ని కూల్చారు. కూల్చే సమయంలో ఎటువంటి నిబంధనలు పాటించకుండా విగ్రహాలను చెల్లాచెదురు అయ్యేలాగా జెసిబితో కూల్చారని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై కూర్చొని నినాదాలు కూడా చేశారు.

దీంతో స్పందించిన అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే ఆ ప్రదేశాన్ని సందర్శించి నిరసన తెలుపుతున్న వారికి హామీ ఇచ్చారు. 15 రోజులలో కూల్చిన దేవాలయం నిర్మిస్తామని చెప్పడంతో వారు నిరసన విరమించారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు తొందరపడి దేవాలయాన్ని కూల్చారని.. మరోసారి ఇలా జరక్కుండా చూస్తామని అందరి సహకారంతో కూల్చిన స్థానంలోనే దేవాలయాన్ని కట్టిస్తామని ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చారు.

వీడియో చూడండి.. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు
ఖమ్మంలో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్లే జోన్లు
టీ20 ప్రపంచకప్ నుంచి హర్షిత్ రాణా.. సిరాజ్‌కి లక్కీ ఛాన్స్?
టీ20 ప్రపంచకప్ నుంచి హర్షిత్ రాణా.. సిరాజ్‌కి లక్కీ ఛాన్స్?
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
సివిల్ ఇంజనీర్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీలోకి వచ్చేసిన స్వలింగ సంపర్కుల స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఆ విషయంలో ఆలస్యమైతే రూ.75 వేల జరిమానా..? వారికి భారీ షాక్
ఆ విషయంలో ఆలస్యమైతే రూ.75 వేల జరిమానా..? వారికి భారీ షాక్
రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు..
రాత్రికి రాత్రే అమ్మవారి టెంపుల్‌ను కూల్చేసిన అటవీశాఖ అధికారులు..
కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116
కార్పొరేటర్‌గా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.5,116
చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి
చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి
లక్ష్మీదేవి ఆశీస్సులు.. ఈ వేళల్లో కర్పూరం వెలిగిస్తే ఎన్ని లాభాలో
లక్ష్మీదేవి ఆశీస్సులు.. ఈ వేళల్లో కర్పూరం వెలిగిస్తే ఎన్ని లాభాలో