AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఎట్టకేలకు పులిని పట్టేశారు మామ.. వీడియో చూస్తే గూస్ బంప్స్..

ఆపరేషన్‌ జాక్‌ సక్సెసయింది. తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురంలో పులిని విజయవంతంగా బంధించారు. పాక నుంచి బయటకు వచ్చిన పులి.. పక్కనే వున్న చెరువువైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించింది. ఫ్లడ్‌ లైట్‌ వెలుతురులో గురి చూసి మత్తు ఇంజక్షన్‌ను షూట్‌ చేశారు. మగతలో జారుకున్న పులిని బోనులోకి చేర్చారు.

Andhra: ఎట్టకేలకు పులిని పట్టేశారు మామ.. వీడియో చూస్తే గూస్ బంప్స్..
Rajahmundry Tiger Rescue
Shaik Madar Saheb
|

Updated on: Feb 06, 2026 | 7:33 PM

Share

ఆపరేషన్‌ జాక్‌ సక్సెసయింది. తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురంలో పులిని విజయవంతంగా బంధించారు. పాక నుంచి బయటకు వచ్చిన పులి.. పక్కనే వున్న చెరువువైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించింది. ఫ్లడ్‌ లైట్‌ వెలుతురులో గురి చూసి మత్తు ఇంజక్షన్‌ను షూట్‌ చేశారు. మగతలో జారుకున్న పులిని బోనులోకి చేర్చారు. పొద్దున్నుంచి పులి గాండ్రింపుతో హడలిపోయిన జనం… పులి పట్టుపడగానే పండగ చేస్కున్నారు. మత్తులో వున్న పులిని బోనులోకి చేరుస్తుండగా సెల్పీల కోసం ఎగపడ్డారు.

చత్తీస్‌గఢ్ నుంచి ఏలూరు మీదుగా తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన పులి… కూర్మాపురం పొలాల్లో పరుగులు తీసింది. ఈ దృశ్యాలను స్తానికులు కెమెరాల్లో బంధించారు. జనవాసాల్లోకి దూసుకొచ్చిన పులి.. పూరిపాకలోకి దూరింది. పుణె, హైదరాబాద్‌ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్స్‌ను పులిని బంధించేందుకు పకడ్బందీ వ్యూహం పన్నారు. పాక చుట్టూ ఫెన్సింగ్‌ .. ఎదురుగా ఫ్లడ్‌ లైట్లను ఏర్పాట్టు చేశారు. వాళ్ల అంచనా నిజమైంది. వెలుతురుకు పులి పాక నుంచి బయటకు వచ్చింది.

వీడియో చూడండి..

పక్కనే వున్న చెరువు వైపు దౌడ్‌ తీసింది.అప్పటికే అలెర్ట్‌గా వున్న రెస్క్యూ టీమ్.. మత్తు ఇంజక్షన్‌ను షూట్‌ చేశాయి. గురి తప్పదలేదు. మత్తు ఇంజక్షన్‌ తగలగానే పులి మగతలోకి జారుకుంది. ఐతే మత్తు ఐదు నిమిషాలకు మించి వుండదు.అంతే పోలీసులు, రెస్యూ టీమ్స్‌ పరుగులు తీశారు. మత్తులో వున్న పులిని ఒడుపుగా బంధించి.. బోనులోకి చేర్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం