GBS Cases: తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న గులియన్ బారే సిండ్రోమ్.. 25 ఏళ్ల మహిళ మృతి!
ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు "గులియన్ బారే సిండ్రోమ్.."(GBS. ఇది ఒక నరాల వ్యాధి. ఈ వ్యాధిని మొదటగా మహారాష్ట్రలో గుర్తించారు. ఈ వ్యాధితో తెలంగాణలో తొలి మరణం నమోదు అయింది. తాజాగా ఈ వ్యాధి ఏపీలో కూడా ప్రవేశించింది. ఏపీలో ప్రస్తుతం 17 గులియన్ బర్రె సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అయ్యినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

“గులియన్ బారే సిండ్రోమ్..” ఇంతవరకూ తెలుగు రాష్ట్రాలకు పరిచయమే లేని ఈ పేరు.. ఇప్పుడు వణికిస్తోంది. ఇప్పుటికే తెలంగాణలో ఒకరిని బలి తీసుకున్న ఈ వ్యాధి..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ టెన్షన్ పుట్టిస్తోంది. వరుసగా నమోదవుతున్న కేసులు..అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలేంటి ఈ “గులియన్ బారే సిండ్రోమ్” ? కరోనాలా ఇది కూడా అంటు వ్యాధా..? వైద్యులు ఏమంటున్నారు..? తెలుసుకుందాం..! ఇప్పటికే బర్డ్‌ఫ్లూతో టెన్షన్ పడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మరింత భయపెడుతోంది గులియన్ బారే సిండ్రోమ్ మరో మాయదారి రోగం. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కలవరం పుట్టిస్తున్న ఈ జీబీఎస్.. ఇటీవల తెలంగాణకు ఎంటర్ అయింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఇప్పుడు తాజాగా ఈ వ్యాధి ఏపీలో కూడా ప్రవేశించింది. ఏపీలో ప్రస్తుతం 17 గులియన్ బర్రె సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అయ్యినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా, కాకినాడలో 4, గుంటూరు, విశాఖలలో 5 చొప్పున జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా GGHకు గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో ఏడుగురు బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జిల్లాలో నాలుగు రోజుల్లోనే ఏడు జీబీఎస్...