Andhra Pradesh: పూజగదిలోని దీపాన్ని తీసుకెళ్లిన ఎలుక.. కట్‌ చేస్తే.. లబోదిబోమన్న గ్రామస్తులు.. అసలేం జరిగిందంటే?

|

Jun 12, 2023 | 7:50 AM

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండ లింగాల వలసలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ మంటల కారణంగా సుమారు ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలెండర్స్ పెద్ద పెద్ద శబ్దాలతో పేలాయి. శబ్దాల ధాటికి గ్రామమంతా ఉలిక్కి పడింది. అసలే మండుతున్న ఎండలు దానికి తోడు గాలులు.. ఇక చెప్పేదేముంది నిమిషాల్లో మంటలు దావానంలా పాకాయి.

Andhra Pradesh: పూజగదిలోని దీపాన్ని తీసుకెళ్లిన ఎలుక.. కట్‌ చేస్తే.. లబోదిబోమన్న గ్రామస్తులు.. అసలేం జరిగిందంటే?
Rat
Follow us on

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండ లింగాల వలసలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ మంటల కారణంగా సుమారు ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలెండర్స్ పెద్ద పెద్ద శబ్దాలతో పేలాయి. శబ్దాల ధాటికి గ్రామమంతా ఉలిక్కి పడింది. అసలే మండుతున్న ఎండలు దానికి తోడు గాలులు.. ఇక చెప్పేదేముంది నిమిషాల్లో మంటలు దావానంలా పాకాయి. గ్రామస్తులంతా భయాందోళనతో పరుగులు తీశారు. కొందరు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేదు. చివరికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తరువాత గ్రామస్తులు అగ్నిప్రమాదం కి గల కారణాల పై ఆరా తీశారు. దీంతో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో మరో రెండు రోజుల్లో పండుగ జరగనుంది. అందుకోసం అంతా ముమ్మర ఏర్పాట్లు, ముందస్తు పూజలతో సందడి గా మారింది. అందులో భాగంగా ఓ పూరింట్లో దేవుడికి పూజ చేసి దీపం వెలిగించి కొద్ది సేపటి తరువాత బయటకు వెళ్ళిపోయారు కుటుంబసభ్యులు. ఇంతలో ఓ ఎలుక ఇల్లంతా తిరిగి దీపం ను తీసుకెళ్లటానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో నూనె తో ఉన్న దీపం ఇంటి పూరి కప్పుకు తగిలి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి.

మంటలను గమనించి ఆర్పే లోపు ఇళ్లంతా మండిపోయింది, అంతటితో ఆగకుండా ప్రక్కన ఉన్న మరికొన్ని ఇళ్లకి తాకి పెను ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంతో భాదితులు ఇళ్లు వాకిలి లేక కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. గ్రామంలో పండుగ వేడుకలు జరగాల్సిన సమయంలో ఎలుక పెట్టిన ఈ మంటలు మా ప్రాణాల పైకి తెచ్చింది రా దేవుడా అని లబోదిబోమంటున్నారు బాధితులు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.5 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా.

ఇవి కూడా చదవండి

-కోటేశ్వరరావు గమిడి, టీవీ9 రిపోర్టర్, విజయనగరం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..