కృష్ణా జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఇంట్లో బాణాసంచా పేలుడు.. పూర్తిగా కాలిపోయిన మహిళ..
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘోరం జరిగింది. ఉల్లింగపాలెం హరిజన వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘోరం జరిగింది. ఉల్లింగపాలెం హరిజన వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకెళితే.. ఉల్లింగపాలెంలోని హరిజన వాడలో ఓ ఇంట్లో బాణసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అలా ఆ మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ ఘటనలో మహిళ చీలి రాధ(35) పూర్తిగా కాలిపోయింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెంటనే అప్రమత్తం అయిన స్థానికులు.. మంటలను ఆర్పారు. కొన ప్రాణాలతో ఉన్న బాధిత మహిళను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన ఇంటిని పరిశీలించారు. ఇళ్ల మధ్యలో బాణాసంచా తయారు చేయడంపై పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
