Visakhapatnam: విశాఖలో ఆగని ‘ప్రైవేట్’ దందా.. మూడు ఆసుపత్రులకు భారీగా ఫైన్.. రోగులకూ చెల్లించాలని ఆదేశాలు..

Private Hospitals: కరోనా కాలంలో ప్రైవేటు ఆసుపత్రులు సామాన్యుల నుంచి దోచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై

Visakhapatnam: విశాఖలో ఆగని ‘ప్రైవేట్’ దందా.. మూడు ఆసుపత్రులకు భారీగా ఫైన్.. రోగులకూ చెల్లించాలని ఆదేశాలు..
Private Hospitals
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 21, 2021 | 10:48 PM

Private Hospitals: కరోనా కాలంలో ప్రైవేటు ఆసుపత్రులు సామాన్యుల నుంచి దోచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ కొరడా ఝుళిపిస్తోంది. దీనిలో భాగంగా.. విశాఖపట్నంలో ప్రైవేట్ హాస్పిటల్స్ దందాపై అధికారులు చర్యలు తీసుకున్నారు. రోగుల వద్దనుంచి అదనంగా వసూలు చేసిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు మళ్లీ తిరిగి చెల్లించాలని టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 18 లక్షలను తిరిగి పేషెంట్లకు చెల్లించాలని స్పష్టంచేశారు. ఈ మేరకు మూడు ఆసుపత్రులకు రూ.18 లక్షలు జరిమానా విధిస్తూ జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలిచ్చారు.

విశాఖ నగరంలోని పినాకిల్ హాస్పిటల్‌కు రూ. 10 లక్షల జరిమానాతో పాటు రోగికి రూ.10 లక్షలు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలిచ్చారు. ఓమ్ని ఆర్కే ఆసుపత్రికి రెండు లక్షల ఫైన్ తో పాటు రోగికిరూ 4.39 లక్షలు చెల్లించాలని ఆదేశాలిచ్చారు. ఆదిత్య ఆసుపత్రికి రూ.5 లక్షల జరిమానా విధించి.. రూ. 3.61 లక్షలు రోగికి చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఎ.ఎం.జి.రుత్, ప్రథమ, సిద్దార్థ, లేన్ సెట్ ఆసుపత్రులకు నోటీసులు సైతం జారీ చేశారు.

ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తుండటంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 37 ఆసుపత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

Also Read:

Harassment: మార్ఫింగ్ ఫోటోలతో మహిళలకు బెదిరింపులు.. పక్కా స్కెచ్ వేసి అడ్డంగా బుక్ చేసిన..

ఈ నాలుగు రాశుల వారు బంధాల నుంచి విడిపోవడం విషయంలో చాలా ఫాస్ట్.. ఏ రాశుల వారు..ఎందుకు అలా ఉంటారు?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే