Andhra Pradesh: ఈ పక్షిని గుర్తిస్తే చాలు ప్రభుత్వ ఉద్యోగం మీదే..

కడప జిల్లాలో అటు శేషాచలం ఇటు నల్లమల అడవులు ఉన్నాయి. జిల్లాలోని సిద్దవటం, బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పేర్కొంటారు. ఈ అడవిలో ఎన్నోజాతుల పక్షులు, జంతువులు ఉన్నాయి. ఈ అడవిలోనే కలివికోడి కనిపించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా పెరిగే కలివి పొదల్లో ఈ జాతి పక్షులు ఉండడంతో దీన్ని కలివి కోడి అంటున్నారు. 1948 నాటికి ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని పక్షిశాస్త్ర నిపుణులు సైతం నిర్దారించారు. అయితే అనూహ్యంగా 1986 జనవరి 5న అట్లూరు మండలం రెడ్డిపల్లె...

Andhra Pradesh: ఈ పక్షిని గుర్తిస్తే చాలు ప్రభుత్వ ఉద్యోగం మీదే..
Kalivi Kodi
Follow us
Sudhir Chappidi

| Edited By: Narender Vaitla

Updated on: Aug 07, 2023 | 1:03 PM

పక్షి ఏంటి దానిని కనిపెడితే ప్రభుత్వ ఉద్యోగం ఏంటి అని అనుకుంటున్నారా.? అవును నిజమే అంతరించిపోయిన పక్షి జాతిలో అత్యంత అరుదైన పక్షి కలివి కోడి. అసలు ఈ కోడి పేరు ఎప్పుడైనా విన్నారా. నిజానికి ఇది కోడి కాదు అరుదైన పక్షి. ప్రపంచంలో ఈ పక్షి అంతరించిపోయిందని అందరూ భావించారు. పక్షిశాస్త్ర నిపుణులు కూడా ఈ జాతి 1948లోనే అంతరించి పోయిందని నిర్దారించారు. అయితే 1986 లో కడప జిల్లాలోఈ పక్షి కనిపించి కడప జిల్లా పేరును తెరపైకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం కలివికోడిని వెతకటానికి కోట్లు ఖర్చు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. దీనిని కనిపెట్టిన వారికి అటవీశాఖలో ఉద్యోగం కూడా ఆఫర్ ఇచ్చింది.

కడప జిల్లాలో అటు శేషాచలం ఇటు నల్లమల అడవులు ఉన్నాయి. జిల్లాలోని సిద్దవటం, బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పేర్కొంటారు. ఈ అడవిలో ఎన్నోజాతుల పక్షులు, జంతువులు ఉన్నాయి. ఈ అడవిలోనే కలివికోడి కనిపించింది. కలివి పొదల్లో ఈ జాతి పక్షులు ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది. 1948 నాటికి ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని పక్షిశాస్త్ర నిపుణులు సైతం నిర్దారించారు. అయితే అనూహ్యంగా 1986 జనవరి 5న అట్లూరు మండలం రెడ్డిపల్లె వాసి చిన్న ఐతయ్యకు ఈ పక్షి కనిపించింది. ఐతయ్య దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించజంతో వారు దాన్ని కలివికోడిగా గుర్తించారు. ఈ విషయాన్ని ప్రముఖ పక్షి శాస్త్రవేత్త నిపుణులు సలీం అలీకి తెలపడంతో ఆయన వెంటనే లంకమల అటవీ ప్రాంతానికి వచ్చి ఆ పక్షిని పరిశీలించారు. అయితే దురదృష్ట వశాత్తు ఆ పక్షి ఆయన చేతిలోనే మరణించింది. అప్పటి నుంచి మళ్లీ ఆ పక్షి కనిపిస్తుందేమోనని నేటి వరకు వెతుకుతూనే ఉన్నారు. లంకమల అడవుల్లో పలుచోట్ల ప్రత్యేకమైన కెమెరాలు, కూత వినేందుకు మైకులు ఏర్పాటు చేశారు.

కలివికోడి పెద్ద సైజు కౌంజు పక్షిలా పొడవాటి కళ్లతో ఉంటుంది. దీనిని శాస్త్రీయంగా జోర్డాన్ కోర్సర్ అని పక్షి శాస్త్ర నిపుణులు పిలుస్తారు. ముదురు గోధుమరంగు ఈకలతో మెడలో హారం ధరించినట్లు ముదురు తెల్ల రంగు చారలు ఉంటాయి. ఇది ముళ్ల పొదలతో కూడిన పచ్చిక మైదానాలలో నివసిస్తుంది. రాత్రి వేళ మాత్రమే తిరుగుతుంది. దీని కూత దాదాపు 200 మీటర్ల దాక వినిపిస్తుంది. నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా కలివికోడి కూతను రికార్డు చేయించి దాని గురించి కరపత్రాలు ముద్రించి విస్తృతంగా ప్రచారం కూడా చేయించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే 1986 జనవరి 5వ తేదీ ఐతయ్య అనే ఓ గొర్రెల కాపరి గొర్రెల కోసం వెళ్లి ఈ పక్షిని కనుగొన్నారు.ఇలా ఆ గొర్రెల కాపరి ఈ పక్షిని కనుగొనడం అటవీశాఖ అధికారులకు అందించడం , వారు వెంటనే పక్షిశాస్త్ర నిపుణులు రావడంతో ఈ కలివికోడి గురించి దేశం మొత్తం తెలుసుకున్నారు. ఇక ఐతయ్య కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఐతయ్యను వాచర్ గా గుర్తించి అటవీశాఖలో ఉగ్యోగం కూడా ఇచ్చింది. అంతేకాక ఈ పక్షి ఆవాస ప్రాంతం నుంచి తెలుగుగంగ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం భావిస్తే . ఇది కనుక జరిగితే ఈ అరుదైన పక్షి జాతి అంతరించిపోతుందని పర్యావరణకారులు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆపివేయాలని కోర్టులో పిటిషన్ కూడా వేశారు.

కోట్లుతో పరిశోధనా కేంద్రం..

కేంద్ర ప్రభుత్వం కలివికోడిని కనిపెట్టడంకోసం ఇప్పటి వరకు దాదాపు రూ. 48 కోట్లు ఖర్చు పెచ్చినట్టు ప్రాథమిక సమాచారం. ఉంకా దీనిన వెతకడంకోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తూనే ఉంది . అంతేకాక కడప జిల్లాలో లంకమలలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎక్కడైతే కలివి కోడి కనిపించిందో ఆ రెడ్డిపల్లె గ్రామం వద్దే చిన్న పకిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు. అంతేకాక లంకమలలో సీసీ కెమేరాలు, పక్షి కూత రికార్డ్ కోసం మైకులను కూడా ఏర్పాటు చేశారు. మానవజాతి ఎంత ముఖ్యమో వారితో పాటు జీవరాసులు కూడా అంతే ముఖ్యం అందులో భాగమే కలివికోడి అందుకే ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గకుండా కలివికోడి కోసం కోట్లు ఖర్చు పెట్టి ఆజాతి దొరికితే దానిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా కడపలోని లంకమలలో కలివికోడి వేట మాత్రం కొనసాగుతూనే ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..