AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack: భారత్‌తో యుద్ధం.. పాక్ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరే చూడండి

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ దాడి వెనక పాక్ హస్తం ఉందని స్పష్టమైన ఆధారాలు లభ్యం కావడంతో భారత ప్రభుత్వం ఇప్పటికే పాక్ పై దౌత్య పరంగా యుద్ధం ప్రకటించింది.

Pahalgam Terror Attack: భారత్‌తో యుద్ధం.. పాక్ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరే చూడండి
Pahalgam Terror Attack India vs Pakistan
Basha Shek
|

Updated on: Apr 25, 2025 | 11:13 PM

Share

పహల్గామ్‌ దాడి వెనక పాక్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చి చెబుతున్నాయి. దాడిపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించిన తీరు కూడా పహల్గామ్ అటాక్ వెనక దాయాది దేశం ఉందని తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం ఇప్పటికే పాక్ పై తీవ్ర ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందం రద్దు, వీసా సేవలతో పాటు దౌత్య సంబంధాలను నిలిపివేస్తున్నామంటూ భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతోన్న పాక్ కు భారత ప్రభుత్వ ఆంక్షలు, నిబంధనలతో పాక్ కు మరిన్ని సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. మరోవైపు భారత్ -పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే ఒక వేళ యుద్ధమే జరిగితే పాక్ కు భారీగా నష్టం తప్పదంటున్నారు నిపుణులు. దీనిపై పాక్ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. తమ బాధను సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కుతున్నారు. పాక్ ప్రజలు పోస్ట్ లు, మీమ్స్ తో తమ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం పాకిస్తాన్ వ్యవసాయం, జలవిద్యుత్ పై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడనుంది. భారత ప్రభుత్వం నిర్ణయంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సింధు పరీవాహక ప్రాంతం నుంచి నీటి సరఫరా ఆగిపోతనుంది. సింధు నదిపై ఆధారపడే పాక్ లో 80 శాతం వ్యవసాయం జరగనుంది. అలాగే జలవిద్యుత్‌లో మూడవ వంతు సింధు నది నీటి నుంచే ఉత్పత్తి అవుతుంది.

ఇక సింధు జలాల ఒప్పందం అమల్లోకి వస్తే పాకిస్తాన్‌లో, ముఖ్యంగా పంజాబ్, సింధ్‌లలో తీవ్రమైన నీటి సంక్షోభానికి దారితీస్తుందంటున్నారు. ఇది నీటిపారుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, భూగర్భజల క్షీణత, లవణీయత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రజలు తమ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మీమ్స్, పోస్టు లు షేర్ చేస్తూ పాక్ సర్కారును ఎండగడుతున్నారు.

ఇవి కూడా చదవండి

  సొంత ప్రజల నుంచే పాక్ సర్కారుకు  తీవ్ర వ్యతిరేకత

మీమ్స్ తో  పాక్ ప్రభుత్వాన్ని  ఎండగడుతోన్న దాయాది ప్రజలు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..