Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajahmundry: కన్నతండ్రే కాలునాగులా కాటేశాడు.. నరకం చూసిన మైనర్ బాలిక

నాన్నంటే ఓ ధైర్యం.. ఎంత కష్టం వచ్చినా ఆయన కాపు కాస్తాడని ఓ నమ్మకం. ఏ సమస్య అయినా నన్ను దాటాకే నా బిడ్డను తాకాలని ప్రతి తండ్రి చెబుతుంటారు. పిల్లల భవిష్యత్ కోసం.. ఎన్నో త్యాగాలను చేసిన తండ్రులను నేటి సమాజంలో మనం చూస్తున్నాం. కానీ వీడు తులసివనంలో గంజాయి మొక్క..

Rajahmundry: కన్నతండ్రే కాలునాగులా కాటేశాడు.. నరకం చూసిన మైనర్ బాలిక
Girl (Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 12, 2025 | 12:16 PM

నాన్న అంటే నడిచే దేవుడిలా భావిస్తారు పిల్లలు. ముఖ్యంగా ఆడపిల్లలకు తండ్రితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. కూతుర్ని ఓ ప్రిన్సెస్‌లా చూసుకునే నాన్నలు మనకు సమాజంలో ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటారు. ఆకతాయిలు ఏడిపించినా.. చదువులు ఒత్తిడి వేధిస్తున్నా.. ఇలా భరించలేని ఏ సమస్య వచ్చినా నాన్నతోనే షేర్ చేసుకుంటారు కొందరు కుమార్తెలు. కానీ ఓ తండ్రే కూతురి పాలిట కాలకేయుడయ్యాడు. కన్నబిడ్డనే చెరిచాడు. తండ్రి ఆకృత్యం గురించి బయటకు చెప్పలేక.. పంటి బిగునవ బాధను భరిస్తూ తల్లిడిల్లిపోయింది ఆ పాప. పాఠశాలలో ఆ అమ్మాయి ముభావంగా ఉండటాన్ని గమనించిన టీచర్.. ఏం జరిగిందని అడగ్గా.. జరిగిన దారుణాన్ని చెబుతూ బావురుమంది. దీంతో టీచర్స్ సాయంతో పాప పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో పోక్సో కేసు నమోదు అయ్యింది.

రాజమండ్రి త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ వ్యక్తి(45) మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 17 ఏళ్ల కిందట మ్యారేజ్ అవ్వగా.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో..  ఎనిమిదేళ్ల కిందట బిడ్డల్ని తీసుకుని భార్య అమ్మగారింటికి వెళ్లిపోయింది. తండ్రికి చేదోడుగా ఉండేందుకు..  పదిహేనేళ్ల పెద్ద కుమార్తె మూడేళ్లుగా అతని వద్దే ఉంటోంది. టౌన్‌లోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదవుతుంది. మంగళవారం స్కూల్‌కు వచ్చిన బాలిక ముభావంగా ఉండడాన్ని టీచర్స్ గమనించారు. బాలికను దగ్గరికి తీసుకుని మాట్లాడితే.. తండ్రి చేస్తోన్న ఆకృత్యాన్ని వివరించి వెక్కి వెక్కి ఏడ్చింది. విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన టీచర్స్..  వారి సహకారంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. కొద్ది నెలల కిందట మద్యం మత్తులో తండ్రి తనపై తొలిసారి లైంగిక దాడి చేశాడని.. నాటి నుంచి నిత్యం అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని పోలీసులకు బాలిక చెప్పింది. దీంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..