AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: ఏసీలో నుంచి అదో మాదిరిగా చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా.. కుప్పలు తెప్పలుగా

మీకు ఏసీ ఉందా..? అయితే.. బి కేర్ ఫుల్..! అసలే ఎండాకాలం కదా అని ఆదమరిచి ఉంటే.. ఆ ఏసీలు సర్పాలకు ఆవాసాలుగా మారిపోయే అవకాశం ఉంది. ఎండాకాలంలో చల్లదనం కోసం సర్పాలు అక్కడ ఇక్కడ అని కాదు. ఎక్కడైనా తన అనువుగా ఉందనుకున్న ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. విశాఖలో ఏసీలోకి చొరబడి భయపెట్టాయి పాములు. వాతావరణం వేడెక్కడంతో చల్లదనం కోసం ఏమోగానీ.. ఇండోర్ యూనిట్లో తిష్టవేసుకుకూర్చున్నాయి. బెడ్ రూమ్‌లో ఏసీ వేసుకొని సేద తీరేందుకు వెళ్లిన కుటుంబానికి.. ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి తొంగి చూస్తున్నట్టుగా పాములు కనిపించడంతో పరుగులు పెట్టారు. 

Vizag: ఏసీలో నుంచి అదో మాదిరిగా చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా.. కుప్పలు తెప్పలుగా
Snake Catcher Kiran
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 12, 2025 | 10:48 AM

Share

విశాఖ పెందుర్తి పొలగానిపాలెం నేతాజీ నగర్‌లో అపార్ట్మెంట్ ఫ్లాట్.. కుప్పలు తెప్పలుగా పాములు కలకలం రేపాయి. ఇంట్లో ఏసీ యూనిట్లో పాములు దూరినట్టు అనిపించింది ఆ కుటుంబ సభ్యులకు. బెడ్ రూమ్ ఏసీలోంచి ఏవో వింత శబ్దాలు.. వినిపించాయి. అయినా పట్టించుకోకుండా ఏసీ వేసేసరికి… ఆ స్ప్లిట్‌ నుంచి పాములు వేలాడుతూ కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు కుప్పలు తెప్పులుగా కనిపించడంతో భయంతో ఏసీని ఆపేశారు. దీంతో మళ్లీ పాములు లోపలకి వెళ్లిపోయాయి. చూసి వణికి పరుగులు పెట్టారు కుటుంబ సభ్యులు. స్నేక్ కేచర్ కిరణ్‌కు సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు పాములను బయటకు తీశాడు. చెట్లలో నివసించే ఈ పాములను బ్రాంజ్ బ్యాక్ పాములు అంటారని అంటున్నాడు స్నేక్ కిరణ్. ఇవి విషపూరితం కావని చెబుతున్నాడు.

ఆ పాములు అందులో అందుకోసమేనా..?!

పెందుర్తి పొలాగానేపాలెం నేతాజీ నగర్‌లోని ఓ ఇంట్లోని ఏసీలోకి చొరబడ్డాయి  ఈ పాములు. పాములను చాకచక్యంగా బయటకు తీయడంతో ఊపిరి పీల్చుకుంది ఆ కుటుంబం. ఏసీ అవుట్ డోర్ యూనిట్ నుంచి.. పైపు గుండా.. ఇండోర్ యూనిట్లోకి వచ్చి ఉంటుందని అంటున్నారు కిరణ్.  చల్లదనానికి లేదా.. ఏసీలో చేరిన కొన్ని రకాల పురుగులు ఆహారంగా తీసుకునెందుకు అవి వచ్చి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. ఏకంగా బెడ్ రూమ్ ఏసీలోనే పాములు కనిపించడంతో ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంసంగా మారింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకిన వెంటనే.. ఏసి వేసుకోవాలంటే అంటే కాస్త ఆలోచిస్తున్నారు కొంతమంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మలుపు!
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మలుపు!
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!