
ఎంతో సంతోషంగా దైవ సందర్శనకు బయలుదేరారు.. కొద్దిసేపు ఎంతో ఆటపాటలతో సాగిన వారి ప్రయాణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. కంటి రెప్ప వేసి తెరిచేలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది.. రైలు భోగి మారే క్రమంలో తండ్రి కూతురిని మృత్యువు కబళించింది.. దైవదర్శనానికి వెళుతూ తండ్రి కూతురు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది..
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గని ఆత్కూరుకు చెందిన రామచందర్రావు , సునీత దంపతులు హైదరాబాదులోని మియాపూర్ లో స్థిరపడ్డారు.. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.. రామచంద్ర రావు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.. పెద్ద కూతురు జశ్విత ఇంటర్మీడియట్ చదువుతుంది.. చిన్న కూతురు జనని పదో తరగతి చదువుతోంది.. కోటి ఆశలతో ఎంతో సంతోషంగా సాగిపోతున్న మీ కుటుంబంలో ఊహించని విషాదాన్ని వీరి జీవితాన్ని మార్చేసింది..
నిజామాబాద్ బాసరలోని సరస్వతి దేవికి పూజ చేసేందుకు కుటుంబం మొత్తం రైలులో బయలుదేరారు.. తండ్రి రామచంద్రరావు , భార్య సునీత ఒక భోగిలో ఇద్దరు కుమార్తెలు మరో భోగీలో ఎక్కారు.. నిజామాబాద్ రాగానే అందరూ ఒకే భోగిలోనే ఉండాలని భార్య ఉన్న భోగిలోకి పెద్ద కూతురు జస్విత అని ఎక్కించాడు.. చిన్న కూతురు జననిని రైలు ఎక్కిస్తుండగా రైలు బయలుదేరింది.. దీంతో పట్టు తప్పి జనని రైలు కింద పడిపోయింది. కూతుర్ని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి కూడా రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయాడు.. ఈ ప్రమాదంలో చిన్న కూతురు జనని అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన రామచంద్రరావును ఆసుపత్రికి తరలించారు.. కానీ ప్రయోజనం లేకుండాపోయింది.. మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.. భర్త , కూతురు భార్య కళ్ళముందే చనిపోవడం కన్నీరు మునీరుగా వినిపించారు..
తండ్రి కుమార్తె మృతదేహాలను స్వగ్రామం గని ఆత్కూరు తరలించారు.. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. వారి పార్థివ దేహాలను సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..