Watch Video: ఆ సమస్యపై పాడి రైతు ఆవేదన.. గాంధీ విగ్రహం వద్ద వినూత్న నిరసన..
చిత్తూరులో ఒక పాడి రైతు వినూత్న నిరసనకు దిగారు. వీధికుక్కల దాడుల్లో లేగ దూడలు మరణిస్తున్నాయని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. వీధి కుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ పాడి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు కార్పొరేషన్లో గాంధీ విగ్రహం వద్ద పాడి ఆవులతో ధర్నా నిర్వహించారు.
చిత్తూరులో ఒక పాడి రైతు వినూత్న నిరసనకు దిగారు. వీధికుక్కల దాడుల్లో లేగ దూడలు మరణిస్తున్నాయని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. వీధి కుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ పాడి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు కార్పొరేషన్లో గాంధీ విగ్రహం వద్ద పాడి ఆవులతో ధర్నా నిర్వహించారు. పాడి ఆవులతో జీవనం కొనసాగిస్తున్న తేనెబండకు చెందిన రైతు మదన్మోహన్ ఈ నిరసన కార్యక్రమం చేపట్టాడు. గత రెండు రోజుల క్రితం మదన్మోహన్కు చెందిన లేగ దూడలపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీంతో జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు హాజరై ఫిర్యాదు చేశాడు.
వీధికుక్కలను నియంత్రించాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించాడు. అయితే అధికారులు స్పందించకపోవడంతో మదన్మోహన్ కుక్కల దాడికి గురై.. గాయపడ్డ లేగ దూడతో ఆందోళన చేపట్టారు. వీధికుక్కలు కరవడంతో ఒక లేగ దూడ మరణించిందని చెప్పాడు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తన పాడి ఆవులతో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద చేరుకుని ధర్నా నిర్వహించాడు.
జిల్లా కలెక్టర్‌కు, కార్పొరేషన్ అధికారులకు వీధికుక్కల సమస్యపై వినతి పత్రం సమర్పించినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వీధికుక్కల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తన పాడి ఆవులతో ధర్నాకు దిగడంతో అధికార యాంత్రాంగం స్పందించింది. రంగంలోకి దిగిన కార్పొరేషన్, వైద్యారోగ్య విభాగం అధికారులు, పోలీసులు మదన్మోహన్కు నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు. తన లేగదూడ మరణించడం పట్ల మదన్మోహన్ పాడి ఆవులతో ధర్నా చేయడం చిత్తూరులో చర్చనీయాంశం అయ్యింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..