AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో ఇకపై రెగ్యులర్ హెల్త్ చెకప్స్.. పైసా ఖర్చు లేకుండా బీపీ, షుగర్ వంటి టెస్టులు..

ఏపీలోని ప్రజలు ఆరోగ్యపరంగా ఏదైనా అనుమానముంటే.. మన డాక్టర్ ద్వారా మనమే అడిగి తెలుసుకోవచ్చు. నేరుగా ఫోన్ లోనూ మాట్లాడవచ్చు. ఇదంతా ఏపీ సర్కార్ అమల్లోకి తెస్తోన్న ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా రానున్న సదుపాయం. ఇందుకోసం పూర్తి స్థాయిలో డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకం జరుగుతుంది.

Andhra Pradesh: ఏపీలో ఇకపై రెగ్యులర్ హెల్త్ చెకప్స్.. పైసా ఖర్చు లేకుండా బీపీ, షుగర్ వంటి టెస్టులు..
Andhra Pradesh CM Jagan Mohan Reddy
Ram Naramaneni
|

Updated on: Oct 20, 2022 | 3:41 PM

Share

వైద్య రంగంలో కీలక సంస్కరణలు తీసుకొస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరో ముందడుగు వేసింది. ప్రతి వ్యక్తి ఎప్పటికప్పుడు తన ఆరోగ్య స్థితిని తెలుసుకునేలా.. సరి కొత్త వైద్య విధానం తీసుకొస్తోంది. ఫ్యామిలీ ఫిజీషియన్ పేరిట.. నర్సుల నుంచి స్పెషలిస్టు డాక్టర్ల వరకూ ఎల్లవేళలా వైద్య సదుపాయం, వైద్య సాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 21న ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ ను స్మార్ట్ లాంచింగ్ చేయనుంది.. జగన్ సర్కార్. అసలేంటీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని చూస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల 32 గ్రామ సచివాలయాల్లో వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గతంలో ANM, ఆశా వర్కర్లు మాత్రమే వైద్య సేవలు అందించేవారు. ఇప్పుడు వీరితో పాటు BSC నర్సింగ్ పూర్తి చేసిన వారిని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించింది. వీరంతా YSR హెల్త్ క్లినిక్స్ లో అందుబాటులో ఉంటారు. ఇక్కడి నుంచే టెలీ మెడిసిన్ సౌకర్యం కూడా లభిస్తుంది. స్పెషలిస్టు డాక్టర్లతో టెలి కాన్ఫెరెన్సు ద్వారా రోగులు మాట్లాడేలా ఏర్పాటు చేస్తారు. 67 రకాల మందులు, 14 రకాల వ్యాధి నిర్దారక కిట్లు ఈ YSR హెల్త్ క్లినిక్స్ లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

బీపీ, షుగర్, జ్వరం, డయేరియాతో పాటు ఇతర రోగాలు కూడా.. ఇక్కడే నయం చేసేలా చర్య తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వీటితో పాటు ప్రతి PHC లో 14 మంది స్టాఫ్ ఉండేలా నియామకాలు చేస్తోంది జగన్ సర్కార్. ప్రతి గ్రామ సచివాలయానికి మొబైల్ మెడికల్ యూనిట్.. నెలకు రెండు రోజులు నిర్దేశిత సమయాల్లో వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది.. ఈ మొబైల్ యూనిట్ లో స్పెషలిస్ట్ వైద్యులు గ్రామాల్లోకి వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలవరకూ అక్కడే అందుబాటులో ఉంటారు. అంతే కాదు మంచం మీద నుంచి ఎటూ కదల్లేని.. రోగుల దగ్గరకు స్వయంగా వెళ్లి పరీక్షల జరిపి.. అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఆయా సచివాలయాలకు వచ్చే డాక్టర్ల ఫోన్ నెంబర్లు సైతం అందుబాటులో ఉంచనుంది జగన్ ప్రభుత్వం.

దీని ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా.. నేరుగా డాక్టర్ తో మాట్లాడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఈ కాన్సెప్ట్ కి.. ఫ్యామిలీ ఫిజిషియన్ గా పేరు పెట్టామంటున్నారు అధికారులు. ఈ నెల 21 నుంచి ఈ కొత్త విధానాన్ని సాఫ్ట్ లాంచ్ చేయనుంది ప్రభుత్వం. వచ్చే డిసెంబర్ లేదా సంక్రాంతి నుంచి పూర్తి స్థాయిలో కొత్త వైద్య విధానం అమలు చేసేలా ముందుకెళ్తోంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.

భారీగా మెడికల్ వాహనాలు కొనుగోలు

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా  గిరిజన ప్రాంతాలకు నూతనంగా నలభై అధనపు 108, 104 వాహనాలు కేటాయించనున్నారు.  748 ఉన్న అంబులెన్స్ లకు అదనంగా గిరిజన ప్రాంతాల కోసం మరో ఇరవై 108 అంబులెన్స్ లు కేటాయించారు.  656గా ఉన్న 104 వాహనాలకు మరో ఇరవై అదనంగా జమ చేశారు.  త్వరలో ప్రారంభించనున్న ఫ్యామిలీ డాక్టర్ పథకం కోసం 67 కోట్ల రూపాయలతో 282 మొబైల్ మెడికల్ వాహనాలు కొనుగోలు చేసింది ఏపీ సర్కార్.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..