TDP: నంద్యాల సభతో టికెట్ చర్చకు తెరపడుతుందా.. బాబు మనసులో ఏముంది..?

సమస్యల నుంచే సమస్యకు  పరిష్కారం.. ఇది  తరుచూ  చంద్రబాబు  చెప్పే మాట. కానీ ఇప్పుడు వివాదం నుంచి కూడా పరిష్కారానికి బాట అవుతుందా?  సభల ముంగిట్లో రభస.. అందుకు సంకేతమా? విజయవాడ బాటలో ఇప్పుడు ఆళ్లగడ్డ పంచాయితీ అలా తెరపైకి వచ్చింది. ఆళ్లగడ్డ టికెట్‌ ఎవరికి? అధినేత పర్యటన క్రమంలో నంద్యాల జిల్లాలో ఈ ప్రశ్న హాట్‌ టాపిక్‌గా మారింది.  ఆళ్లగడ్డలో టీడీపీ బహిరంగ సభకు సర్వం సిద్దమైంది.

TDP: నంద్యాల సభతో టికెట్ చర్చకు తెరపడుతుందా.. బాబు మనసులో ఏముంది..?
Nandyala Public Meeting
Follow us

|

Updated on: Jan 09, 2024 | 10:10 AM

సమస్యల నుంచే సమస్యకు  పరిష్కారం.. ఇది  తరుచూ  చంద్రబాబు  చెప్పే మాట. కానీ ఇప్పుడు వివాదం నుంచి కూడా పరిష్కారానికి బాట అవుతుందా?  సభల ముంగిట్లో రభస.. అందుకు సంకేతమా? విజయవాడ బాటలో ఇప్పుడు ఆళ్లగడ్డ పంచాయితీ అలా తెరపైకి వచ్చింది. ఆళ్లగడ్డ టికెట్‌ ఎవరికి? అధినేత పర్యటన క్రమంలో నంద్యాల జిల్లాలో ఈ ప్రశ్న హాట్‌ టాపిక్‌గా మారింది.  ఆళ్లగడ్డలో టీడీపీ బహిరంగ సభకు సర్వం సిద్దమైంది. ఇక  సాయంత్రం వేదికపై  చంద్రబాబు ఆళ్లగడ్డ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే చర్చతో పాటు.. తననే అభ్యర్థిగా ప్రకటించాలన్న అఖిల ప్రియ కామెంట్స్‌పై  ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అందుకు ఓ కారణం ఉంది. ఆళ్లగడ్డ సభపై  డిసెంబర్‌ నుంచే చర్చలు జరిగాయి.  భారీ సభ ఖర్చును తాను భరించే పరిస్థితుల్లోలేవని.. తనకు టికెట్‌ కన్‌ఫర్మ్‌ చేస్తే ఆర్ధిక  వనరులు సమకూరుతాయని అఖిల ప్రియ స్పష్టంగా చెప్పారని.. ఓ రకంగా అల్టిమేటమ్ ఇచ్చారే గుసగుసలు గుప్పుమన్నాయి. మరోవైపు ఇలాంటి పరిణామాలు చాలా జరిగాయి. ఈక్రమంలో ఆళ్లగడ్డ టికెట్‌పై    అఖిలప్రియకు అనుమానం వచ్చిందని పార్టీలో ఇంటర్నల్‌ టాక్‌. జనసేన పొత్తు వల్ల అఖిల ప్రియ టికెట్‌ ఆశలకు గండి పడే చాన్స్‌ వుందనేది మరో టాక్‌.

ముద్రపడ్డ ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు వైసీపీని వీడి ఈమధ్యే జనసేనలో చేరారు.  ఇక అఖిలప్రియకు బద్ధ శత్రువుగా మారిన ఆమె కజిన్ భూమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి టీడీపీ టికెట్‌ ఇస్తారన్న ప్రచారం కూడా బాగా జరిగింది. దీంతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఆళ్లగడ్డను బీజేపీకి కేటాయించే అవకాశం కూడా ఉందన్నది నియోజకవర్గంలో జరుగుతున్న మరో ప్రచారం. టికెట్‌పై ఎవరి లెక్కలు ఎలా వున్నా  ఆళ్లగడ్డ సభ కేంద్రంగా పాత లొల్లి మళ్ళీ రాజుకుంది. టికెట్‌ కోసం అల్టిమేటం సంగతేమో కానీ.. సభకు ఏవీ సుబ్బారెడ్డి రావద్దని  అఖిలప్రియ స్పష్టం చేయడం.. ఆపేదెవరు వెళ్లి తీరుతానని సుబ్బారెడ్డి  అనడం.. ఈ వ్యవహారం  సభకు ముందే రభసగా మారింది.

ఇక మొన్నటిదాకా బహిరంగ సభ ఏర్పాట్లకు దూరంగా ఉన్న భూమా అఖిలప్రియ .. ఏం జరిగిందో ఏమో కానీ సభకు రెండ్రోజులముందు యాక్టివ్‌ అయ్యారు. ఆళ్లగడ్డలో భూమా శోభ ఘాట్ దగ్గర 10 ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అఖిల యాక్టివ్‌ మోడ్‌లోకి రావడం చూసి అల్టిమేటం ఫలించిందా?  టికెట్‌‎పై హామీ  లభించిందా? ఆమె పేరునే బహిరంగ సభలో అధినేత చంద్రబాబు ప్రకటిస్తారా? అఖిల ప్రియ వద్దాన్నా ఏవీ సుబ్బారెడ్డి  సభకు వచ్చితీరుతారా?  ఇలా ఆళ్లగడ్డలో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయిప్పుడు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో  జనసేన  నేత ఇరిగాల రామపుల్లారెడ్డి భేటీ పొత్తుకు సంకేతమా? ఆ ఇద్దరి సమావేశం తరువాత సంచలన సందేశం వుంటుందా?..  బహిరంగ సభ వేదికగా అధినేత చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేస్తారోనని  అంతా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..