ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి, వాతావరణం కూల్‌గా మారుతుందని ఆశించిన ప్రజలకు ఇంకా వడగాల్పులు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఉక్కపోత తప్పడం లేదు. సోమవారం రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే అనకాపల్లి, కాకినాడ, కడప, విజయనగరం జిల్లాలో 44.8°C ఉష్ణోగ్రత నమోదైంది. మన్యం జిల్లా, కోనసీమ జిల్లాలో 44.1°C ఉష్ణోగ్రత రికార్డ అయ్యింది. అయితే రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టవని అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడానికి మరో రెండు రోజులు సమయం పడుతుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే మరో రెండు రోజులు ఎండలు తీవ్రత భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమంత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే ఎండ తీవ్రత ఉన్నా మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షం పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల కింద ఉండకూదని అధికారులు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..