Eluru: రికార్డు కెక్కించిన రూపాయి.. మొట్టమొదటి భారతీయుడిగా ఏలూరు విద్యార్థి ప్రపంచ రికార్డు

ఏలూరు రూరల్ మండలం పత్తికోళ్లలంక వాసి ఈ శ్యాం ప్రసాద్. ప్రస్తుతం శ్యాం ప్రసాద్ ఏలూరు సి ఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అయితే అతడు ఇటీవల చేసిన నిర్మాణానికి భారతదేశం తరపున సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రూపాయి కాయిన్స్ ఉపయోగించి మోడల్ హౌస్ నిర్మించి ప్రపంచ రికార్డు సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డుకు ఎక్కాడు.

Eluru: రికార్డు కెక్కించిన రూపాయి.. మొట్టమొదటి భారతీయుడిగా ఏలూరు విద్యార్థి ప్రపంచ రికార్డు
Eluru
Follow us
B Ravi Kumar

| Edited By: Rajeev Rayala

Updated on: Oct 30, 2023 | 10:32 AM

తన ప్రతిభతో ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు చేశాడు ఆ విద్యార్థి.. తన మనసులోని ఆలోచనను కార్య రూపంలో పెట్టి వివిధ వైవిధ్యభరితమైన నిర్మాణాలు తయారుచేసి దేశానికి గుర్తింపు తేవటమే కాకుండా, తన ఖాతాలో పలు రికార్డులు నమోదు చేసుకున్నాడు. అతని పేరు బొద్దూరి శ్యాం ప్రసాద్.. ఇంతకీ అతడు చేసిన ఆవిష్కరణ ఏంటి..? ఆవిష్కరణకు వచ్చిన గుర్తింపు ఏంటి.. ? ఏలూరు రూరల్ మండలం పత్తికోళ్లలంక వాసి ఈ శ్యాం ప్రసాద్. ప్రస్తుతం శ్యాం ప్రసాద్ ఏలూరు సి ఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అయితే అతడు ఇటీవల చేసిన నిర్మాణానికి భారతదేశం తరపున సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రూపాయి కాయిన్స్ ఉపయోగించి మోడల్ హౌస్ నిర్మించి ప్రపంచ రికార్డు సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డుకు ఎక్కాడు.

డిగ్రీ స్టూడెంట్ శ్యాం ప్రసాద్ 2700 రూపాయి కాయిన్స్ ను ఉపయోగించి కేవలం 98 గంటల్లోనే ఈ ఘనతను పూర్తి చేశాడు. దాంతో ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అతని పేరు నమోదైంది. అక్టోబర్ 1 వ తేదీ నుండి నాల్గవ తేదీ వరకు సుమారు 98 గంటల్లో రూపాయి కాయిన్స్ తో మోడల్ హౌస్ ను నిర్మించాడు. రూపాయి కాయిన్స్ తో మోడల్ హౌస్ నిర్మాణానికి ఒకే రకమైన రూపాయి నాణేలను ఉపయోగించాడు. ఈ మోడల్ హౌస్ నిర్మాణం మొత్తం కూడా ఒక రూపాయి కాయిన్ పై మరొక రూపాయి కాయిన్ నిలబెట్టి, వాటిని అంటించడానికి పూర్తిగా ఫెవికాల్ గమ్ ని ఉపయోగించాడు.ఈ మోడల్ హౌస్ నిర్మాణం  పొడవు 36 అంగుళాలు, వెడల్పు 24 అంగుళాలు, ఎత్తు 24 అంగుళాలుగా వుండే విధంగా దానిని నిర్మించాడు.

శ్యాం ప్రసాద్ చిన్నతనం నుంచి స్కూల్లో జరిగే సైన్స్ ఫెయిర్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. తనకు వచ్చే ఆలోచనలకు కళారూపం ఇచ్చి ఆవిష్కరణలు వెలుగులోకి తెచ్చాడు. శ్యాం ప్రసాద్ పత్తికోళ్లలంక హై స్కూల్లో చదివిన సమయంలో జరిగిన సైన్స్ ఫెయిర్ లో హరిత గృహ వ్యవసాయం అనే పేరుతో ఓ నమూనా గృహాన్ని తయారుచేసి వ్యవసాయ భూముల్లోనే కాకుండా ఎత్తయిన భవనాలపై కూడా వ్యవసాయం చేసి లాభాలు ఆర్జించవచ్చనే విధంగా నిర్మించాడు. ఇది పలువురిని ఆకర్షించటంతో పాటు ఆ నమునాకు మంచి గుర్తింపు లభించింది. ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క వైవిద్య భరితమైన ఆవిష్కరణలు చేపట్టి ప్రపంచ రికార్డులు సాధిస్తున్నారు . కొల్లేరు ప్రాంతం ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక మంచినీటి సరస్సు. ఇది ఏలూరు జిల్లాకు తలమాణికం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్ధి నూతన ఆలోచనలతో ముందుకు సాగుతుండటం అభినందనీయం.

Eluru 1

Eluru