Visakhapatnam – Rayagada: సిగ్నల్ లోపమా.? మానవ తప్పిదమా.? ఘటనా స్థలంలో భారీ క్రేన్లు.

Visakhapatnam – Rayagada: సిగ్నల్ లోపమా.? మానవ తప్పిదమా.? ఘటనా స్థలంలో భారీ క్రేన్లు.

Anil kumar poka

|

Updated on: Oct 30, 2023 | 9:57 AM

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. విశాఖ-పలాస ప్యాసింజర్‌ను విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టడంతో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర జరిగిందీ ఘటన జరిగిన. రైలుప్రమాద స్థలంలో సహాయకచర్యలను దగ్గురండి పర్యవేక్షించారు మంత్రి బొత్స సత్యనారాయణ..రైలుప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. విశాఖ-పలాస ప్యాసింజర్‌ను విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టడంతో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర జరిగిందీ ఘటన జరిగిన. రైలుప్రమాద స్థలంలో సహాయకచర్యలను దగ్గురండి పర్యవేక్షించారు మంత్రి బొత్స సత్యనారాయణ..రైలుప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు విజయనగరం కలెక్టర్‌ నాగలక్ష్మి.రైలు ప్రమాదధాటికి బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. సాయం కోసం బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.రైలుప్రమాదంలో మృతిచెందిన వారి డెడ్‌బాడీలను ఒక్కొక్కటిగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు అధికారులు. రైలుప్రమాద స్థలంలో బాధితులకు కొనసాగుతున్న సహాయకచర్యలను దగ్గురండి పర్యవేక్షించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. రైలు ప్రమాదంలో లోకో పైలెట్‌ ఎంఎస్‌ రావులుతోపాటు ట్రెయిన్‌ గార్డ్‌ మృతి చెందడంపై రైల్వే ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.