Kerala: టిఫిన్ బాక్సులో పేలుడు పదార్థాలు.! కేరళ సీఎంను ఆరా తీసిన అమిత్‌షా.
కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. కలమస్సెరీలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అక్టోబరు 29 ఉదయం 9 గంటల 40 నిమిషాల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడం, క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది.
కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. కలమస్సెరీలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అక్టోబరు 29 ఉదయం 9 గంటల 40 నిమిషాల సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడం, క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. ఈ ప్రార్థనలలో పాల్గొనేందుకు దాదాపు 2 వేలకు పైగా వచ్చారని, పేలుడు జరిగిన తర్వాత అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా కేరళలో ఒకేరోజు మూడుసార్లు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
ఈ పేలుళ్ల ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రార్థన సెంటర్‌లో టిఫిన్ బాక్స్‌లో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్‌లోకి దుండగులు పేలుడు పదార్ధాలను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన అనంతరం సెంటర్‌లో దట్టమైన పొగ కమ్ముకుందని స్థానికులు తెలిపారు. భయాందోళనకు లోనైన ప్రజలు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారిందని తెలిపారు. ఎన్‌ఐఏ యాంటీ టెర్రర్ ఏజెన్సీఈ ఘటనపై విచారణ చేపట్టింది. పేలుడు ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారులందరూ ఎర్నాకులంలో ఉన్నారని, డీజీపీ ఘటనా స్థలానికి చేరుకున్నారని పేర్కొన్నారు. పేలుడు ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నామని, పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని వివరించారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు అమిత్‌షా ఈ ఘటనపై కేరళ సీఎం పినయయి విజయన్‌ను ఆరాతీశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

