Elephants Hulchul: గ్రామాల్లో గజరాజుల బీభత్సం.. భయభ్రాంతుల్లో గ్రామస్థులు.. అరటి, చెరకు సహా అనేక పంటలు నాశనం
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కురుపాం మండలంలో తిష్టవేసిన ఏనుగుల గుంపు.. పలు గ్రామాలలో సంచరిస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ఇప్పటికే అరటి, చెరకు సహా అనేక పంటలను నాశనం చేసాయి
అరణ్యాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలను పులులు, గజరాజులు, విషసర్పాలు వణికిస్తున్నాయి. గ్రామాల్లో తిరుగుతూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రైతులు, పరిసర గ్రామస్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా గజరాజులు గ్రామాల్లోకి వచ్చి.. చేతికి అంది వస్తున్న పంటలను నాశనం చేస్తున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కురుపాం మండలంలో తిష్టవేసిన ఏనుగుల గుంపు.. పలు గ్రామాలలో సంచరిస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నాయి. ఇప్పటికే అరటి, చెరకు సహా అనేక పంటలను నాశనం చేసాయి. రైతులు తమ జీవనాధారం కోసం వేసుకున్న పంటపొలాల్లోకి దిగి.. పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. తాజాగా అరటి, ఫామాయిల్ తోటలు నామరూపాలు లేకుండా మార్చేశాయి. గత కొద్ది రోజులుగా గ్రామాల్లోకి ఏనుగులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నామని చెబుతున్నారు.
ఏనుగుల గుంపు తిరుగుతుండటంతో రైతులు వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల బీభత్సంతో పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు.. తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పంటను మొత్తం నాశనం చేయడంతో తాము ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల బీభత్సం వల్ల లక్షల రూపాయలు పంట నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించి, తమకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..