AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: ‘ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకోండి.. మీరూ మా బిడ్డలే’.. మంత్రి హరీశ్‌ రావు సంచలన వ్యాఖ్యలు

'తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే. ఒక దిక్కే ఓటూ పెట్టుకోండి. అదీ తెలంగాణలోనే పెట్టుకోండి’ అంటూ మంత్రి హరీశ్‌ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్‌ బిడ్డింగ్‌పై ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో హరీశ్‌ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి.

Harish Rao: 'ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకోండి.. మీరూ మా బిడ్డలే'.. మంత్రి హరీశ్‌ రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao
Basha Shek
|

Updated on: Apr 12, 2023 | 6:59 AM

Share

‘ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితిపై అక్కడున్న వాళ్లను అడగండి. అలాగే మీరూ అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు కదా.. అక్కడికీ, ఇక్కడికీ తేడా చూడండి. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే. ఒక దిక్కే ఓటూ పెట్టుకోండి. అదీ తెలంగాణలోనే పెట్టుకోండి’ అంటూ మంత్రి హరీశ్‌ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్‌ బిడ్డింగ్‌పై ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో హరీశ్‌ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి. సంగారెడ్డిలో మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు మేడే రోజున సీఎం కేసీఆర్‌ శుభవార్త వినిపిస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రూ.2 కోట్ల వ్యయంతో కార్మిక భవనాలను నిర్మిస్తామన్నారు. మేడే రోజున వీటికి శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా భవన నిర్మాణ కార్మిక మండలిలో సభ్యత్వం తీసుకోవాలని  మంత్రి హరీశ్ సూచించారు.

ఏపీ పరిస్థతి చూస్తున్నారా?

‘ ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్లు ఎంతో మంది వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారు. పక్కన ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసు. అక్కడికీ.. ఇక్కడికీ భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా (జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌) ఉంది. ఏపీ, తెలంగాణ.. ఈ రెండు ప్రాంతాలనూ మీరు ప్రత్యక్షంగా చూసుంటారు. అలాగే మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్తుంటారు కదా? అక్కడి రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందో చూసే ఉంటారు. మరి మీకు అక్కడ ఓటెందుకు? అక్కడ బంద్‌ చేసుకుని ఇక్కడ ఓటు నమోదు చేసుకోండి. మీరు కూడా మా వాళ్లే. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే. కాబట్టి ఆంధ్రావోళ్లు తెలంగాణలోనే ఓటు నమోదు చేసుకోండి’ అని చెప్పుకొచ్చారు హరీశ్‌ రావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
ఆధునిక ఫీచర్లతో దూసుకెళ్తున్న టాటా పంచ్
ఆధునిక ఫీచర్లతో దూసుకెళ్తున్న టాటా పంచ్
ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు ..
ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు ..
డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి ఆన్సర్ ఇదే
డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి ఆన్సర్ ఇదే
దేశవ్యాప్తంగా కుండపోత వానలు.. ఐఎండీ వార్నింగ్!
దేశవ్యాప్తంగా కుండపోత వానలు.. ఐఎండీ వార్నింగ్!
భారత సీఎన్‌జీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డులు
భారత సీఎన్‌జీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డులు
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్