AP Elections 2024 Counting: అలా చేస్తే జైలుకే.. సోషల్ మీడియాపై పోలీసుల ప్రత్యేక నిఘా..

ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. స్ట్రాంగ్ రూముల వద్ద శాంతిభద్రతల కోసం 67కంపెనీల కేంద్ర బలగాలు మొహరింపజేశారు. కౌంటింగ్ సెంటర్‎ల చుట్టూ రెడ్ జోన్ 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1985 సున్నిత ప్రాంతాలు గుర్తించినట్లు తెలిపింది ఈసీ. ఇప్పటివరకూ 12,000 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదనంగా 50 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు మొహరించారు.

AP Elections 2024 Counting: అలా చేస్తే జైలుకే.. సోషల్ మీడియాపై పోలీసుల ప్రత్యేక నిఘా..
Election Commission

Updated on: Jun 04, 2024 | 6:46 AM

ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. స్ట్రాంగ్ రూముల వద్ద శాంతిభద్రతల కోసం 67కంపెనీల కేంద్ర బలగాలు మొహరింపజేశారు. కౌంటింగ్ సెంటర్‎ల చుట్టూ రెడ్ జోన్ 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1985 సున్నిత ప్రాంతాలు గుర్తించినట్లు తెలిపింది ఈసీ. ఇప్పటివరకూ 12,000 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదనంగా 50 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు మొహరించారు. మొత్తం 5600 మంది కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. CRPF ఐజి చారు సిన్హా హెడ్ క్వాటర్స్‎లో ఉండి సిచువేషన్ మానిటరింగ్ చేయనున్నారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, చిత్తూరుకు భారీగా కేంద్ర బలగాలు మొహరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 5 అంచెల భద్రత ఏర్పాటు చేసి డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ అబ్జార్వర్‎గా దీపక్ మిశ్రాను నియమించారు.

కౌంటింగ్ నేపథ్యంలో 4 ,5 తేదీల్లో విజయోత్సవాలకు ర్యాలీలకు అనుమతి రద్దు చేస్తూ ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గొడవ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామంటూ సిపి హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి బ్లాక్‎కు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‎తో పాటు 9 టి.ఆర్ గ్యాస్ టీమ్లు రంగంలోకి దిగనున్నాయి. రెండు టియర్ గ్యాస్ వాహనాలు అందుబాటులో ఉంచారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్సులు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో నేడు మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు ఏపీ డీజీపీ. గీత దాటితే తాటతీస్తామంటు వార్నింగ్ ఇచ్చారు. IT act కింద కేసులు రౌడీ షీట్లు ,PD ACT ప్రయోగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‎గా పెట్టుకోవడం, షేర్ చేయడంపై కూడా నిషేధం విధించారు. గ్రూప్ అడ్మిన్‎లు అలెర్ట్ గా ఉండాలంటు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..