AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna District: చిల్లర లేదన్నందుకు ఇంత చిల్లరగా ప్రవర్తిస్తారా కండక్టర్ గారూ..!

ఉయ్యూరు డిపో బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధుడిపై మహిళా కండక్టరు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. టికెట్ కోసం రూ.200 ఇచ్చిన వృద్ధుడితో వాగ్వాదం కాస్త దాడిగా మారింది. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో కండక్టరుపై గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఆర్టీసీ అధికారులు బాద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Krishna District: చిల్లర లేదన్నందుకు ఇంత చిల్లరగా ప్రవర్తిస్తారా కండక్టర్ గారూ..!
passenger assaulted-by -conductor
Ram Naramaneni
|

Updated on: Jun 27, 2025 | 8:46 AM

Share

ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ఓ వృద్ధ ప్రయాణీకుడిపై మహిళా కండక్టరు దాడి చేసిన సంఘటన గురువారం తోట్లవల్లూరు మండలం కనకదుర్గ కాలనీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వివాదం పెద్దదిగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తోట్లవల్లూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద పెద్దిబోయిన మల్లిఖార్జునరావు ఉయ్యూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. టికెట్ కోసం మహిళా కండక్టర్‌కు రూ.200 నోటు ఇవ్వగా.. పెద్ద నోటు ఇస్తే ఎట్లా? అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై.. ఘర్షణ తలెత్తింది.

వివాదం పెద్దది కావడంతో కనకదుర్గ కాలనీ వద్ద మహిళా కండక్టర్ వృద్ధుడిని బస్సు దింపేసి.. అతడిపై దాడి చేసింది. ఈ ఘటనను వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ది వైరల్ అయింది. మహిళా కండక్టర్ గతంలోనూ ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించిందని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది.

తాజా ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని సమాచారం. ఉయ్యూరు డిపో ఇన్‌ఛార్జి డీఎం పెద్దిరాజు స్పందిస్తూ.. ఘటనపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని.. బాద్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రయాణికుడిపై దాడిని ఖండించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..