AP Crime: డబ్బు కోసం రక్త సంబంధాన్ని మరిచాడు.. పూజారి హత్య కేసులో విస్తుపోయే విషయాలు

|

Mar 26, 2022 | 12:36 PM

మనీ సంబంధాల ముసుగులో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. డబ్బు కోసం కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. సొంత వారు అని కూడా చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి...

AP Crime: డబ్బు కోసం రక్త సంబంధాన్ని మరిచాడు.. పూజారి హత్య కేసులో విస్తుపోయే విషయాలు
Priest Murder
Follow us on

మనీ సంబంధాల ముసుగులో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. డబ్బు కోసం కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. సొంత వారు అని కూడా చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో(East Godavari district) జరిగిన పూజారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాల కారణంగా దారుణంగా హత్య చేశారని వెల్లడించారు. ఈ కేసులో అయిదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిడదవోలు(NIdadavolu) మండలం తాడిమళ్ల గ్రామ శివారులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఈనెల 21న పూజారి కొత్తలంక వెంకట నాగేశ్వరశర్మ దారుణ హత్యకు(Murder) గురయ్యారు. అర్ధరాత్రి అయినప్పటికీ భర్త ఇంటికి రాకపోవడంతో.. కుటుంబసభ్యులకు పూజారి భార్య సమాచారం అందించారు. ఈ క్రమంలో పూజారి ఆచూకీ కోసం రాత్రి ఆలయం వద్దకు వెళ్లిన కుటుంబసభ్యులు బయట ఆయన వాహనం కనిపించకపోవడంతో వెళ్లిపోయారు. పని మీద వేరొక ఊరికి వెళ్లి ఊంటారని భావించారు. తెల్లవారినప్పటికీ నాగేశ్వర శర్మ ఇంటికి రాకపోవడంతో అతని ఆచూకీ కోసం గాలించారు.

ఆలయ ఆవరణలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి నాగేశ్వర శర్మ కుటుంబసభ్యులు హతాశులయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆస్తి విషయంలో తలెత్తిన విభేదాలతో నాగేశ్వర శర్మ తమ్ముడి కుమారుడు వీరవెంకట సుబ్రహ్మణ్య సుమంత్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. మరో నలుగురితో కలిసి ఈ హత్య చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. వీరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

Also Read

IPL 2022: క్రికెటర్ లవర్స్‌కి జియో గుడ్ న్యూస్‌.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు స్పెషల్‌ రీచార్జ్‌ ప్లాన్స్‌..

Crime news: ఇంటర్ విద్యార్థితో కలిసి.. మహిళా లెక్చరర్ పరారీ.. విచారణలో షాకింగ్ విషయాలు

Heat wave: సమ్మర్‌ అంటే ఎలా ఉంటుందో ఇవాళ్టి నుంచి తెలుస్తుంది.. నిప్పులు చిమ్మనున్న భానుడు